‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్.. లీక్ చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:58 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన క్రేజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Ranabaali OTT Release Date

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన క్రేజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కించుకుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత రష్మిక, విజయ్‌ల కలయికలో వచ్చిన చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే, థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ (Ranabaali OTT Release Date)కు సంబంధించి నెట్టింట సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.


ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ‘రణబాలి’ స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొంది. అయితే ఏమైందో ఏమో కానీ.. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు ఆ ట్వీట్‌ను హడావుడిగా డిలీట్ చేశారు.


Ranabaali-OTT.jpg

నెట్‌ఫ్లిక్స్ ఆ పోస్ట్‌ను తొలగించే లోపే పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు దాన్ని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. దీంతో ‘రణబాలి’ నవంబర్ 13 నుంచే ఓటీటీలోకి అడుగుపెడుతోందన్న వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా వ్యాపించింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవకముందే ఈ విజువల్ వండర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుండటంతో విజయ్, రష్మికల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి త్వరలోనే దీనిపై మరోసారి అధికారిక రీ-అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్సయిన వాళ్లతో పాటు, ఇంట్లోనే ఈ పీరియాడిక్ యాక్షన్‌ను మళ్లీ చూడాలనుకునే సినీ ప్రియులకు నవంబర్ 13 నుంచి పండగే అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

శింబు - నయన్.. పదేశ్ల తర్వాత మళ్లీ కలవబోతోన్న క్రేజీ జోడీ?

సూర్య వెయ్యి కోట్లు కొల్లగొడతాడా.. అసలు సీన్‌కి అంత సీన్ ఉందా?

రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్‌ ఏంటంటే?

Updated Date - Nov 02 , 2026 | 02:58 PM

Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం

Ranabaali: టాక్ మిక్స్‌డ్.. కలెక్షన్లు మాత్రం అదుర్స్.. ‘రణబాలి’ బాక్సాఫీస్ రిపోర్ట్

Ranabaali: ఏందయ్య సామీ ఫుల్‌సాంగ్‌

Ranabaali: స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ తగ్గలేదు.. అయినా విజయ్‌కు జీవన్మరణ సమస్య

Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా..