RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌కు అర్థమేంటి?

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:44 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. చరణ్, సుక్కు కాంబోలో రెండోసారి తెరకెక్కనున్న చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.

RC17 Movie Launched

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం #RC17 (#RC2Sukku) ఆదివారం హైదరాబాద్‌లో సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది (RC17 Launch). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

RC17-Launch.jpg

ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, వేడుకకు విచ్చేసిన ఇతర దర్శకులు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


నెమలి ఈకలో రామ్ చరణ్.. ఆ పోస్టర్‌కు అర్థమేంటి?

మూవీ లాంచ్‌తో పాటు మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ప్రీ-లుక్ ఆర్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెల్లటి బ్యాక్‌డ్రాప్‌పై నీలం, ఆకుపచ్చ, బంగారు వర్ణాల బ్రష్‌స్ట్రోక్స్‌తో రూపొందించిన ఈ చిత్రంలో ఒక అందమైన నెమలి ఈక (Peacock Feather) కనిపిస్తుంది. ఆ నెమలి పింఛం ఆకృతిలోనే రామ్ చరణ్ ముఖపు రూపురేఖలను ఎంతో కళాత్మకంగా, రహస్యంగా మిళితం చేశారు. ఇందులో రామ్ చరణ్ ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా, కాస్త గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. పురాణాల నేపథ్యమా? లేక ప్రకృతితో ముడిపడిన ఏదైనా సరికొత్త ప్రపంచమా? నెమలి ఈకను కేవలం అందానికే కాకుండా భగవంతుడైన శ్రీకృష్ణుడి తత్వానికి, ప్రకృతి నిగూఢ రహస్యాలకు ప్రతీకగా చూస్తారు. సుకుమార్ తన సినిమాల్లో ప్రతీ ఎలిమెంట్‌ను కథతో లోతుగా ముడిపెడతారన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త, అసాధారణమైన అవతారంలో కనిపించబోతున్నారని ఈ పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతోంది.


RC17-Movie-Launch.jpg

ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు సుకుమార్ ఇచ్చిన “యు కెన్ ఇమాజిన్” అనే క్యాప్షన్ ఇప్పుడు అభిమానుల ఆలోచనలను పీక్స్‌కు తీసుకెళ్లింది. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు కూడా సుకుమార్ ‘నేను చెప్పను.. చెప్పడం నాకిష్టం ఉండదు.. బట్ యు కెన్ ఇమాజిన్’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా రామ్ చరణ్‌ను చూపించిన విధానం ఒక ఎత్తయితే.. ఇప్పుడు అంతకుమించిన భావోద్వేగాలు, కథా బలం, సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ ఈ క్యాప్షన్ ద్వారా చెప్పకనే చెప్పారు. ‘మీ ఊహకు అందని రీతిలో ఈ సినిమా ఉండబోతోంది’ అని పరోక్షంగా చెప్పడమే దీని అసలు ఆంతర్యం. మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలోనే పూర్తి నటీనటులు, ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి:

NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘మెగావర్స్’ ప్రోమో షూట్.. దర్శకుడెవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

అచ్చం అమ్మలాగే.. ‘నగీనా’ శ్రీదేవిగా జాన్వీ కపూర్.. హాలోవీన్ లుక్ వైరల్

Updated Date - Nov 01 , 2026 | 04:44 PM

RC17 - Rajamouli: సుకుమార్‌ - రామ్‌చరణ్‌ ఆ సీన్  ఎలా ఉండబోతోందంటే..!

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

RC17: పూజా కార్యక్రమాలతో మొదలైన రాంచరణ్-సుకుమార్ సినిమా

RC17 కోసం రామ్ చరణ్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్