శింబు - నయన్.. పదేశ్ల తర్వాత మళ్లీ కలవబోతోన్న క్రేజీ జోడీ?

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:30 PM

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు ఉండే క్రేజే వేరు. ఆ జోడీ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నదంటే చాలు.. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెరపై వారి కెమిస్ట్రీ చూసి మురిసిపోతుంటారు.

Simbu and Nayanthara

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు ఉండే క్రేజే వేరు. ఆ జోడీ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నదంటే చాలు.. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెరపై వారి కెమిస్ట్రీ చూసి మురిసిపోతుంటారు. అలాంటి ఒక క్రేజీ జోడీ గురించి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపైనే కాకుండా, బయట కూడా భారీ సెన్సేషన్ సృష్టించిన ఆ జోడీ మరెవరో కాదు.. లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), టాలెంటెడ్ హీరో శింబు (Simbu). వీరిద్దరూ ఒకప్పుడు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై కలిసి నటించబోతుందట.


‘డ్యూడ్’ (Dude) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ (Keerthiswaran).. ప్రస్తుతం శింబుతో ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ సినిమా చేస్తున్న శింబు.. ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. అంతేకాదు, ఇందులో శింబు ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం మేకర్స్ లేడీ సూపర్‌స్టార్ నయనతారను సంప్రదించారట. ఇప్పటికే డైరెక్టర్ ఆమెకు కథ వినిపించగా, ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. నయన్ గనుక ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సరిగ్గా పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ను వెండితెరపై చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కుతుంది. ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. మరి శింబు సరసన నటించడానికి ఆమె వైపు నుంచి అధికారికంగా ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


వీరిద్దరి కాంబినేషన్ అనగానే మనందరికీ టక్కున గుర్తుకొచ్చే సినిమా ‘వల్లభ’ (Vallabha). శింబు - నయనతార తొలిసారి ఈ సినిమాలోనే కలిసి నటించారు. ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి మొదట మిశ్రమ స్పందన లభించినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా యూత్‌ను ఆ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 2016లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఇదు నమ్మ ఆళు’ సినిమాలో రెండోసారి జంటగా నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. ఇప్పుడు సరిగ్గా పదేళ్లకు మళ్లీ ఈ కాంబో రిపీట్ కానుందన్న న్యూస్ బయటకు రావడంతో శింబు - నయన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక అధికారికంగా ఫిక్స్ అయితే.. బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ జోడీ మళ్లీ తెరపైకి వస్తుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

సూర్య వెయ్యి కోట్లు కొల్లగొడతాడా.. అసలు సీన్‌కి అంత సీన్ ఉందా?

రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్‌ ఏంటంటే?

నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Updated Date - Nov 02 , 2026 | 01:30 PM

Simbu: శింబును అవమానించిన విరాట్ కోహ్లీ.. హీరో అని చెప్పినా కూడా

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Simbu: ‘అరసన్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ 

Nayanthara : బాధపెట్టాం... క్షమించండి

Nayanthara : వామ్మో... అంతనా....