RC17: పూజా కార్యక్రమాలతో మొదలైన రాంచరణ్-సుకుమార్ సినిమా

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:31 AM

'రంగస్థలం' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో సినిమా వస్తుందని అప్పట్లోనే వినిపించింది.

'రంగస్థలం' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో సినిమా వస్తుందని అప్పట్లోనే వినిపించింది. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్న సమయంలో ఈ సినిమా గురించి ప్రకటన చేసారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మైత్రి మూవీ మేకర్స్, టి -సిరీస్ నిర్మాణంలో కొత్త సినిమా ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 17వ సినిమా ఇది. 

Pooja RC17.jfif

ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పూజ కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు. నిర్మాత కెఎల్ నారాయణ, గోపీచంద్ మలినేని తదితరులు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ALSO READ:

Anchor Suma: నా వృత్తిజీవితాన్ని గెలిపిస్తూ వచ్చింది అదే.. నా నిర్ణయం సరైనదే!

RC17: అఫీషీయల్.. ఆర్సీ17 పూజ అప్పుడే

Sai Palalvi: మనకేం రాసుందో అదే జరుగుతుంది.. దానికోసం యుద్దాలు అక్కర్లేదు

Updated Date - Nov 01 , 2026 | 12:10 PM