సూర్య వెయ్యి కోట్లు కొల్లగొడతాడా.. అసలు సీన్‌కి అంత సీన్ ఉందా?

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ఈ ఏడాది నిజంగానే ‘గోల్డెన్ ఇయర్‌’గా మారిపోయింది. ఇప్పుడాయన నుంచి రాబోతోన్న ‘సీన్’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు.

Scene Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కెరీర్‌లో ఈ ఏడాది నిజంగానే ‘గోల్డెన్ ఇయర్‌’గా మారిపోయింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ (Karuppu) సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో సునామీ సృష్టించింది. ఆ వెంటనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) చిత్రం కూడా రూ. 200 కోట్లు రాబట్టి సూర్య స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇప్పుడు దీపావళి కానుకగా నవంబర్ 6న సూర్య తన మూడో సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే ‘సీన్’ (Scene). మలయాళంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి సెన్సేషనల్ చిత్రాలను తెరకెక్కించిన జీతు మాధవన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ అందిస్తోన్న మ్యూజిక్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ ఏడాది సూర్య ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు చేరినట్లే.


అయితే ఇక్కడే కోలీవుడ్‌ (Kollywood)లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అదిరిపోయే కలెక్షన్లు సాధించిన సూర్య.. ఈ ‘సీన్’ సినిమాతో కేవలం హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా.. మూడు సినిమాలతో కలిపి ‘వెయ్యి కోట్ల క్లబ్’‌లో చేరిపోతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కోలీవుడ్ చరిత్రలో ఈ రేంజ్ రికార్డ్ సాధించిన మొదటి హీరోగా సూర్య హిస్టరీ క్రియేట్ చేస్తారని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.


కానీ ట్రేడ్ నిపుణులు మాత్రం ఇది అంత ఈజీ కాదంటున్నారు. సూర్య 1000 కోట్ల మైలురాయిని అందుకోవాలంటే ‘సీన్’ సినిమా దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయాలని లెక్కలు చెబుతున్నాయి. సూర్య సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. అంటే నవంబర్ 5న బాలీవుడ్ నుంచి భారీ విజువల్ వండర్ ‘రామాయణ’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇలాంటి పాన్ ఇండియా సినిమాతో పోటీపడి.. ‘సీన్’ సినిమా రూ. 500 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం దాదాపు అసాధ్యమని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా.. ‘కరుప్పు’ రేంజ్ కలెక్షన్లను అందుకోలేకపోయిందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాది సూర్య 1000 కోట్ల టార్గెట్ అనేది కేవలం అభిమానుల కలగానే మిగిలిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. కంటెంట్ బాగుంటే ఏ రికార్డ్ అయినా తిరగరాయవచ్చని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి నవంబర్ 6న రాబోతోన్న ‘సీన్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్‌ ఏంటంటే?

నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..

Updated Date - Nov 02 , 2026 | 01:10 PM

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

Scene: ఈ యేడాది ముచ్చటగా సూర్య మూడో సినిమా!

Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..

Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..

Suriya : మరోసారి తన ఉదారత చూపించాడు..!