‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది
ABN, Publish Date - Nov 21 , 2026 | 08:10 PM
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయవలస’. ఈ సినిమాలో కార్తీక్, శ్రీష నులు జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్లాసీ రొమాంటిక్ మెలోడీని మేకర్స్ వదిలారు.
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో, రాధిక జయంతి (Radhika Jayanthi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయవలస’ (Rayavalasa). ఈ సినిమాలో కార్తీక్ (Karthik), శ్రీష నులు (Sreesha Nulu) జంటగా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌తో పాటు ‘రింగుడు రింగుడు’, ‘జాతర’ పాటలు మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు వాటికి పూర్తి భిన్నంగా, తాజాగా విడుదల చేసిన ‘నీతో ఓ అడుగు’ (Neetho Oo Adugu) అనే క్లాసీ రొమాంటిక్ మెలోడీ యూట్యూబ్‌లో చార్ట్‌బస్టర్‌గా నిలుస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రంతో కార్తీక్ కేవలం హీరోగానే కాకుండా, రచయితగా, సింగర్‌గా తనలోని మల్టీ టాలెంట్‌ను పరిచయం చేస్తుండటం విశేషం.
‘నీతో ఓ అడుగు’ పాటకు హీరో కార్తీక్ స్వయంగా సాహిత్యం అందించడమే కాకుండా, ప్రముఖ గాయని రమ్య బెహరాతో కలిసి తన గాత్రంతో ఆలపించారు. అర్జున్ బాల అందించిన మెలోడీయస్ ట్యూన్‌కు కార్తీక్, రమ్య బెహరా గాత్రం తోడవడంతో పాట వినసొంపుగా మారింది. సముద్ర తీర నేపథ్యంలో సహజమైన ప్రేమ భావనలతో చిత్రీకరించిన ఈ పాట 90ల నాటి క్లాసిక్ మెలోడీలను గుర్తుచేస్తోంది. దర్శకురాలు రాధిక జయంతి టేకింగ్, సినిమాటోగ్రాఫర్ కిట్టు విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ను ఒక అందమైన పెయింటింగ్‌లా తీర్చిదిద్దగా, రాజ్ పైడే కొరియోగ్రఫీలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కనువిందు చేస్తోంది.
పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికతో రూపొందిన ‘రాయవలస’ 11 డిసెంబర్, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రం బిజినెస్ పరంగానూ కీలక మైలురాయిని అందుకుంది. ఆంధ్రా, నైజాం ప్రాంతాలతో పాటు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఓవర్సీస్ హక్కులను సినీ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే మంచి బజ్, డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ దక్కడంతో సినిమాపై చిత్ర బృందం పూర్తి ధీమాతో ఉంది.
ఇవి కూడా చదవండి:
Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా
టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ లిస్ట్‌లోకి నేషనల్ క్రష్
అల్లు అర్జున్‌కు ‘జాయ్ ఆఫ్ లైఫ్’ ఎవరో తెలుసా?