టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ లిస్ట్‌లోకి నేషనల్ క్రష్

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:58 PM

ధనాధన్.. ఫటాఫట్.. అంటూ యాక్షన్‌తో సాగే హీరోయిన్స్ రూటే సెపరేటుగా ఉంటుంది. ఇప్పుడు ఆ రూటులో రశ్మిక కూడా రఫ్ఫాడిస్తూ సాగుతోంది!. టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ జాబితాలో ఇకపై రశ్మిక పేరు కూడా ఉంటుందని అంటున్నారు.

Rashmika Mandanna in Mysaa

ధనాధన్.. ఫటాఫట్.. అంటూ యాక్షన్‌తో సాగే హీరోయిన్స్ రూటే సెపరేటుగా ఉంటుంది. ఇప్పుడు ఆ రూటులో రశ్మిక (Rashmika Mandanna) కూడా రఫ్ఫాడిస్తూ సాగుతోంది!. టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ (Action Queens) జాబితాలో ఇకపై రశ్మిక పేరు కూడా ఉంటుందని అంటున్నారు. ‘మైసా’లో రశ్మిక యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట మరి!

‘మైసా’లోని లిరికల్స్ మెల్లగా జనాన్ని ఆకట్టుకుంటూ సాగుతున్నాయి. ‘ఓ మైసా రే..’ సాంగ్‌లోని ‘పిడికిళ్ళకు కొడవళ్ళను ముడుపు కట్టుడే..’’ అంటూ సాగే లైన్‌ను చూస్తేనే ఇందులో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఇప్పుడు తాజాగా ‘మైసా’ (Mysaa) కోసం రీక్రియేషన్ చేసిన ‘ఒసేయ్ రాములమ్మ’లోని టైటిల్ సాంగ్ కూడా ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చూపిస్తోంది. ఈ మూవీతో రశ్మిక మందన్న కూడా ఓ యాక్షన్ క్వీన్ అయిపోతుందని సినీజనం అంటున్నారు. విజయశాంతి (Vijayashanthi) తర్వాత ఆ రేంజ్‌లో యాక్షన్ క్వీన్‌గా సాగిన వారెవరూ కనిపించలేదు. అయితే ఈ మధ్య ‘యశోద, సిటాడెల్, మా ఇంటి బంగారం’ చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లో భళా అనిపించిన సమంత నవతరం ‘యాక్షన్ క్వీన్’గా నిలిచారు. ఆమె తర్వాతి స్థానాన్ని రశ్మిక భర్తీ చేసేలా ‘మైసా’ రూపొందింది. నవంబర్ 27న ‘మైసా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల చిత్తాలను తన సత్తాతో రశ్మిక ఎలా ఆకట్టుకుంటుందో అన్న ఆసక్తి సినీజనాల్లో చోటు చేసుకుంది.


తెలుగు చిత్రసీమలో యాక్షన్ క్వీన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు విజయలలిత, జ్యోతిలక్ష్మి అనే చెప్పాలి. ఐటమ్ గాళ్స్‌గా సాగుతూనే అనేక చిత్రాల్లో వీరిద్దరూ తమ యాక్షన్‌తోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక హీరోయిన్స్‌లో వాణిశ్రీ కొన్ని చిత్రాల్లో యాక్షన్ సీన్స్‌లో అదరహో అనిపించారు. ఆ పై అంతకుమించి అంటూ అలరించిన నాయిక విజయశాంతి అనే చెప్పాలి. మాస్ హీరోల సినిమాల్లో నటించినా, వాటిలో విజయశాంతి కూడా యాక్షన్ సీన్స్‌తో మురిపించేవారు. అంటే ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్‌లో కాకపోయినా ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి’ చిత్రాల్లో కత్తి పట్టి కదం తొక్కిన అనుష్కను సైతం మరచిపోలేము. అలాగే ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలలో మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తనదైన యాక్షన్ చూపించారు. తాప్సీ పన్ను, రెజీనా కసాండ్రా కూడా కొన్ని సినిమాల్లో ధనాధన్ ఫటాఫట్ అంటూ పోకిరిగాళ్ళను చిత్తు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోనే రశ్మిక కూడా చేరనున్నారని ‘మైసా’ లిరికల్స్ చూస్తోంటేనే తెలుస్తోంది.


నేషనల్ క్రష్‌గా, లవ్లీ బ్యూటీగా సాగుతోన్న రశ్మిక పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మైసా’ లిరికల్స్, ప్రోమోస్ చూస్తోంటే రశ్మిక కూడా యాక్షన్ క్వీన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ‘మైసా’లో రశ్మిక పాత్ర జనాదరణ పొందితే, ఆ తర్వాత ఆమెకు వరుసగా యాక్షన్ క్వీన్ ఇమేజ్‌తో సాగే కథలే వస్తాయని చెప్పొచ్చు. మరి ‘మైసా’ రశ్మికను ఏ రూటులో సాగేలా చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అల్లు అర్జున్‌కు ‘జాయ్ ఆఫ్ లైఫ్’ ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’ వస్తున్నాడు..

‘ఆకాశంలో ఒక తార’ డైరెక్టర్‌, హీరోయిన్‌కు అల్లు అరవింద్ బంపరాఫర్

Updated Date - Nov 21 , 2026 | 06:58 PM

Mysaa: ర‌ష్మిక.. నెవ‌ర్ బిఫోర్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్టార్ట్‌

MYsaa: రష్మిక మందన్న ‘మైసా’ వచ్చేది అప్పుడే.. 

Mysaa Glimpse: నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది

Mysaa: విజయశాంతి తరహాలో.. రష్మిక

Mysaa Teaser: ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు