వాస్తవ సంఘటనల ఆధారంగా 'రాయవలస'

ABN , Publish Date - Apr 04 , 2026 | 10:36 PM

ఊరి జీవితం, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'రాయవలస'. రాధిక జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ జె నిర్మిస్తున్న సినిమా ఇది.

ఊరి జీవితం, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'రాయవలస'. రాధిక జయంతి దర్శకత్వంలో  గోపీకృష్ణ జె నిర్మిస్తున్న సినిమా ఇది. కార్తీక్, శ్రీషా నూలు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి హీరో ఫస్ట్ లుక్ ను శనివారం విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక.. ఊరి జీవితం, మనుషుల మధ్య భావోద్వేగాలను ప్రతిబింబించే కథను తెచ్చే లక్ష్యంతో భారతదేశానికి వచ్చి ఈ సినిమా తీర్చిదిద్దారు. గ్లోబల్ టచ్‌తో నేటివిటీని మిళితం చేసి కథను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీని కిట్టు అందించారు. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తయింది. 


దర్శకురాలు రాధిక మాట్లాడుతూ
'రైస్ మిల్లు యజమాని రాజు జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, గ్రామంలో చిన్నారులతో సరదాగా సాగుతున్న అతని జీవితం.. హీరోయిన్ రాకతో అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. అదెలా అన్నది తెరపై చూడాలి.  హీరో కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో  ఆకట్టుకుంటుంది.  అర్జున్ బాలా (కెనడా) సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది' అన్నారు.  

Updated Date - Apr 06 , 2026 | 11:55 AM