న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సాంగ్.. విశ్వక్ సేన్ అభినందనలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:06 PM

తెలుగు సినిమా ప్రచార శైలి హద్దులు దాటి గ్లోబల్ స్థాయికి చేరుకుంటోంది. చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అనే తేడాలేకుండా వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Rayavalasa Song Launch

తెలుగు సినిమా ప్రచార శైలి హద్దులు దాటి గ్లోబల్ స్థాయికి చేరుకుంటోంది. చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అనే తేడాలేకుండా వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రాయవలస’ (Rayavalasa) టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది. రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ఈ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. కార్తీక్ జయంతి (Karthik Jayanthi), శ్రీష నులు (Sreesha Nulu) హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో సీనియర్ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ (Maa Ooru Rayavalasa) పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) అధికారికంగా విడుదల చేశారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ ఫేమ్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ మట్టి పరిమళాల గీతాన్ని తనదైన జోష్‌తో ఆలపించడం విశేషం. పాటను లాంచ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘రాయవలస’ కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. పాట అద్భుతంగా కుదిరింది. రాహుల్ సిప్లిగంజ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా పాడి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అని చిత్ర బృందాన్ని అభినందించారు.


ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ చిత్రానికి సంబంధించిన పాట అంతర్జాతీయ ఖ్యాతి గడించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ( New York’s Times Square) బిల్‌బోర్డ్‌పై ‘రాయవలస’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘రింగుడు రింగుడు’ ఆంధ్రా జానపద పాట తాలూకు విజువల్స్‌ను ఘనంగా ప్రదర్శించారు. ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించిన ఈ మాస్ ఫోక్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో ఏకంగా 12 లక్షలకు పైగా వ్యూస్‌తో చార్ట్‌బస్టర్‌గా దూసుకుపోతోంది.


పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ కథను సమకూర్చారు. కిట్టు సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నిర్మాణానంతర పనులను ముగించుకుని ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రియాంక పేరు వాడుకుంటే ఇంకోలా ఉండేది: పరిణీతి చోప్రా

‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్‌

థియేటర్లలో ముగిసి.. ఓటీటీకి వచ్చాకా ట్రోలింగ్! దర్శకులకు నిద్రలేని రాత్రులు

Updated Date - Oct 25 , 2026 | 02:06 PM

చార్ట్‌బస్టర్‌గా.. ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్ల’

వాస్తవ సంఘటనల ఆధారంగా 'రాయవలస'

డిసెంబర్ 11న థియేటర్లలోకి.. 'రాయవలస'

Rayavalasa: కొడితే అచ్చుఅడిపోద్ది

Sai Durga Tej: సాయితేజ్‌ సినిమాలో కాంతార భామ