రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:44 PM
శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ గ్లింప్స్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజకు ఈ సినిమా ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. కారణం ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ ఆశలన్నీ ఇప్పుడీ ‘ఇరుముడి’పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. కచ్చితంగా ఈసారి మాస్ రాజాకు బ్లాక్‌బస్టర్ రాబోతోందంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేసింది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మరో ట్రీట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు.
జూన్ 3వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్ (Irumudi Glimpse Date)ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో రవితేజ తన కుమార్తెతో కలిసి కూర్చుని ఉన్నారు. వారి బ్యాక్ సైడ్ మాత్రమే ఈ పోస్టర్‌లో చూపించారు. ఇప్పుడు రాబోయే గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అవుతాయని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇప్పటి వరకు రవితేజ చేయని ఓ వైవిధ్యమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉందని టీమ్ చెబుతోంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని.. దర్శకుడు శివ నిర్వాణ ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు అవసరమైన అన్ని అంశాలతో ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించారని ఇప్పటికే నిర్మాతలు తెలిపి ఉన్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!
Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!