Raviteja : కాంబినేషన్లు కాదు.. కథలు బాగుండాలి!

ABN , First Publish Date - 2022-12-23T04:37:37+05:30 IST

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌... రవితేజ. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే చాలు.. వినోదాల పండగ మొదలైపోయినట్టే...

Raviteja : కాంబినేషన్లు కాదు.. కథలు బాగుండాలి!

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌... రవితేజ. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే చాలు.. వినోదాల పండగ మొదలైపోయినట్టే. ఇప్పుడు ‘ధమాకా’తో మరోసారి అలరించడానికి రెడీ అయ్యారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రవితేజ చెప్పిన ‘ధమాకా’ ముచ్చట్లు...

  • ‘‘ధమాకా పూర్తి స్థాయి వినోద భరిత చిత్రం. ఈమధ్య నేను కాస్త సీరియస్‌ కథల్ని ఎంచుకొన్నా. ‘ధమాకా’ మాత్రం నా శైలిలో ఉంటుంది. త్రినాథరావు చాలా బాగా తీశాడు. రచయిత ప్రసన్నతో తన కాంబినేషన్‌ ఇప్పటి వరకూ బాగా వర్కవుట్‌ అయ్యింది. ఈసారీ బాగా నవ్విస్తాం’’

  • ‘‘శ్రీలీలలో చాలా టాలెంట్‌ ఉంది. తను మంచి నటి, అందంగా ఉంటుంది, డాన్స్‌ బాగా చేస్తుంది.. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగమ్మాయి. ఇంతకంటే ఏం కావాలి? తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి పొజీషన్‌లో ఉంటుంది’’

  • ‘‘భీమ్స్‌ మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. తనకు ఈ సినిమా చక్కటి బ్రేక్‌ ఇస్తుంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చింది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేస్తా. ‘ధమాకా’ని ‘రౌడీ అల్లుడు’తో పోలుస్తున్నారు. ఈ తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల్ని మొదలెట్టింది చిరంజీవి గారే. మేమంతా ఆయన్ని ఫాలో అయిపోతున్నాం’’

  • ‘‘నాకు కథ నచ్చితే చాలు. ఇంకేం ఆలోచించను. కాంబినేషన్లు కాదు.. కథ బాగుంటేనే సినిమా ఆడుద్ది. ఒకేసారి నాలుగైదు కథలు నచ్చేస్తే.. అన్నీ ఒకేసారి పట్టాలెక్కించేస్తా. నాకు ప్రతీ రోజూ సెట్లో ఉండడం అంటే చాలా ఇష్టం. సెట్లో ఉంటే ఆ రోజు పండగలా ఉంటుంది’’

  • ‘‘చిరంజీవి గారితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నా. పూనకాలు వచ్చేస్తాయి. సీన్లు అన్నీ బాగా వచ్చాయి. పండక్కి వస్తోంది కదా.. చూద్దురు గానీ. నిర్మాతగా కొన్ని ప్రాజెక్టులు మొదలవుతాయి.వాటి వివరాలు త్వరలో చెబుతా’’.

Updated Date - 2022-12-23T04:37:49+05:30 IST