ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
ABN , Publish Date - May 31 , 2026 | 08:24 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌ను తన ‘దేవుడు’గా కొలిచే బండ్ల గణేష్.. తాజాగా ఆయనపై ఓ సంచలన పోస్ట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌ను తన ‘దేవుడు’గా కొలిచే బండ్ల గణేష్.. తరచూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన గురించి నా మనసులో ఉన్న విషయాలను ప్రపంచానికి చెప్తానంటూ బండ్ల గణేష్ వేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వారం, పది రోజులుగా పవన్ కళ్యాణ్‌ని కొందరు ఎలా టార్గెట్ చేశారో తెలియంది కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అంతా పవన్ జపమే. యూట్యూబ్ పెయిడ్ బ్యాచ్ అంతా దిగిపోయి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. జనవరి 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరుతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ సభను నిర్వహించబోతున్నారు. దీనిని అడ్డుకునేందుకే అనేలా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించని బ్యాచ్ కూడా డ్యూటీ ఎక్కారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ అనేటోడి గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ఉందని, ఆ క్షణం కోసం వేచి చూస్తున్నానని బండ్ల గణేష్ చేసిన పోస్ట్.. ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తన పోస్ట్‌లో.. ‘‘పవన్ కళ్యాణ్ సార్ ముందు మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ రోజు వస్తే ఆయన గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన గొప్ప మనసును, ఆయన క్యారెక్టర్‌ను, ఆయన నైజాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు గర్వంగా చెబుతాను. పదవులు, హోదాలు కాదు.. మనిషి విలువ అతని ప్రవర్తనలో, మాటలో, మనసులో ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి నా హృదయంలో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచే ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ బండ్ల పై విధంగా రియాక్ట్ అయ్యారు.
పవన్ కళ్యాణ్‌పై ప్రస్తుతం నడుస్తున్న చర్చల నేపథ్యంలో.. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన నిజాయితీని ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్‌ను మెగా అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఎప్పుడూ తన స్పీచ్‌లతో పూనకాలు తెప్పించే బండ్లన్న.. త్వరలోనే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటున్న మనసులోని మాటలను పంచుకునేందుకు వేదిక లభించాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి.. బండ్ల గణేష్ ఏం చెప్పాలనుకుంటున్నారో? ఆ వేదిక ఏ రూపంలో వస్తుందో?
ఇవి కూడా చదవండి:
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?
రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!