సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు

ABN, Publish Date - Oct 24 , 2026 | 12:02 PM

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటించిన భారీ పీరియాడికల్ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని జరిగిన వేడుకలో దర్శకుడి స్పీచ్ వైరల్ అవుతోంది.

Ranabaali Director Rahul Sankrityan

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రశ్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన భారీ పీరియాడికల్ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన ‘రణబాలి రణభేరి’ (Ranabaali Ranabheri) సక్సెస్ మీట్‌లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడిన ఎమోషనల్, బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తన సొంత గడ్డపై జరిగిన ఈ వేడుకలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా ఈ అనంతపురంలోనే. ఇక్కడి థియేటర్లలోనే ‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్లు చూశాను. కెమెరా భుజాన వేసుకుని రాప్తాడు రోడ్డులోనే మొదటి షార్ట్ ఫిలిం తీశా. సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ఇక్కడే నేర్చుకున్నా. ఒక దర్శకుడిగా నా ప్రయాణం మొదలైన ఊరిలోనే.. ఈరోజు నా సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతుంటే మాటల్లో చెప్పలేనంత గర్వంగా, ఆనందంగా ఉంది. మంచి సినిమా ఇస్తే ఆదరించడంలో రాయలసీమ ప్రజలు ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి రుజువు చేశారు’’ అని భావోద్వేగానికి గురయ్యారు.


ఇక మొదట్లో సినిమాపై జరిగిన దుష్ప్రచారంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ‘‘చరిత్రలో మరుగున పడిన ఒక చీకటి కోణాన్ని తెలియజేస్తూ.. కమర్షియల్ సినిమాగా ఇంత పెద్ద స్టార్స్‌తో తీయడం దేశంలోనే బహుశా మొదటిసారి. అయితే ఇంత గొప్ప ప్రయత్నం చేసినప్పుడు కూడా కొందరు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎంతోమంది రివ్యూవర్లు సినిమాని తొక్కేయాలని, నెగిటివ్ చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రేక్షకులకు నచ్చితే ఏ ఒక్కడూ మంచి సినిమాను ఆపలేరని తెలుగు ప్రేక్షకులు తేల్చి చెప్పారు. ఆడియన్సే స్వయంగా రీల్స్ చేస్తూ, సినిమాను భుజాన వేసుకుని డిఫెండ్ చేస్తుంటే మా యూనిట్ అంతా గర్వపడుతోంది’’ అని తన మనసులోని మాటను బయటపెట్టేశారు.

ఇంకా.. ఈ చిత్రం కోసం రాయలసీమ యాస, కల్చర్, పల్లె జీవన విధానం ప్రతిబింబించేలా తానే స్వయంగా అనుభవించిన జ్ఞాపకాలతో స్క్రిప్ట్ రాసుకున్నానని తెలిపారు. సుమారు 5,000 మంది స్థానికులకు ఆడిషన్స్ నిర్వహించి, ఎంతో మంది రాయలసీమ కళాకారులను వెండితెరకు పరిచయం చేశామని చెప్పారు. విజయ్ దేవరకొండ సీమ మొనగాడిగా పరకాయ ప్రవేశం చేశారని, గతంలో చిరంజీవి, బాలకృష్ణ సీమ యాసను ఎంత అద్భుతంగా పలికారో.. విజయ్ కూడా అంతే సునాయాసంగా పలికి థియేటర్లలో ఈలలు వేయించారని ప్రశంసించారు. అలాగే సినిమాలో ‘జయమ్మ’గా నటించిన రశ్మిక మందన్న నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని కొనియాడారు.


చివరగా.. ట్రేడ్ వర్గాలకు, మీడియా మిత్రులకు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఓ ఆలోచింపజేసే హితవు పలికారు. ‘‘మనం సినిమా బిజినెస్‌లో ఇప్పటికీ ‘సీడెడ్’, ‘నైజాం’ అనే పదాలు వాడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆ బానిసత్వపు గుర్తులను వాడటం మానేయండి. అవి కొలోనియల్, బూర్జువా వ్యవస్థల నుంచి వచ్చిన పదాలు. మనకు ఎంతో అందమైన తెలుగు పేర్లు ఉన్నాయి.. దయచేసి ఇకపై సీడెడ్ బదులు ‘రాయలసీమ’ అని, నైజాం బదులు ‘తెలంగాణ’ అనే పిలవండి’’ అంటూ ఆయన సూచనలివ్వడంతో.. వేదికంతా చప్పట్లతో మార్మోగింది.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?

ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?

Sunday TV Movies: అక్టోబ‌ర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు

Updated Date - Oct 24 , 2026 | 12:02 PM