సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RAPO23: ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్.. అర్థమేంటో తెలుసా?

ABN, Publish Date - Nov 20 , 2026 | 08:16 AM

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RaPo23’. ఇంటర్నేషనల్ మెన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ ప్రీ లుక్‌ని మేకర్స్ వదిలారు.

Rapo23 Pre Look

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RaPo23’. ఇంటర్నేషనల్ మెన్స్ డే (అంతర్జాతీయ పురుషుల దినోత్సవం) సందర్భంగా బుధవారం మేకర్స్ ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌ను ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ (The Story of a Lone Wolf) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత మిస్టీరియస్, రఫ్ లుక్‌లో కనిపించి ఒక్కసారి సినిమాపై అంచనాలను పెంచేశారు. భారీ ఆర్కిటెక్చరల్ భవనంలోని మెట్లపై కెమెరాకు వెనుకవైపు తిరిగి నిలబడిన రామ్.. బ్లాక్ అవుట్‌ఫిట్, వెనుక భాగంలో V ఆకారంలో కట్ చేసిన హెయిర్ స్టైల్, తల వెనుక ప్రత్యేకమైన టాటూతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఒక చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని ఉండటం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. గన్, టెడ్డీ బేర్ మధ్య ఉన్న ఈ కాంట్రాస్ట్ ఆయన పాత్రలోని రెండు భిన్న కోణాలను సూచిస్తూ సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచుతోంది.


ఈ సినిమాలోని ప్రధాన పాత్ర స్వభావాన్ని వివరిస్తూ ‘లోన్ వుల్ఫ్’ అనే పదానికి మేకర్స్ పవర్‌ఫుల్ నిర్వచనం ఇచ్చారు. “తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి” అని పేర్కొనడం చూస్తుంటే, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛతో సాగే ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ డ్రివెన్ కథతో రామ్ రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. జనాలకు భిన్నంగా తనదైన పంథాలో నడుస్తూ, నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి కథగా ఇది రూపొందుతోంది. నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న రామ్ పోతినేని, దర్శకుడిగా మారి ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


రాపో సినిమాటిక్స్ (RaPo Cinematics) బ్యానర్‌పై కృష్ణ పోతినేని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు టాలెంటెడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ కీలక పాత్ర పోషిస్తుండగా, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ వంటి స్టార్ ఫైట్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?

శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Updated Date - Nov 20 , 2026 | 08:16 AM