‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:36 PM

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు. ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Vrushakarma Song

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగే ఈ చిత్రం ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’తో ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట ‘ఛలో పదవే’ అనే మెలోడీని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని మరో ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తోంది. మొదటి పాటలోని ఎనర్జీకి భిన్నంగా, ఈసారి మనసును హత్తుకునే మెలోడీతో కథలోని సున్నితమైన భావోద్వేగాలను ఇందులో చూపించారు.


అజనీష్ బి లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ పాట మంచి ఫీల్ తీసుకొచ్చింది. అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన సాహిత్యం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సాయి విఘ్నేష్ తన వాయిస్‌తో పాటకు మరింత ఎమోషనల్ డెప్త్‌ను తీసుకొచ్చారు. చిన్నారి గొంతుతో వచ్చే వోకల్స్ పాటలోని అమాయకత్వాన్ని, అందాన్ని మరింతగా పెంచాయి. అలాగే నాగ చైతన్య, కియారా ఖన్నా మధ్య ఉండే ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తోంది. చూపు లేని చిన్నారి అయినప్పటికీ, ఎంతో అమాయకంగా, తెలివిగా ఉంటుంది. ఆమె జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా అర్జున్ తన కళ్లుగా మారి అండగా నిలుస్తున్నట్లుగా చూపించారు. వీరిద్దరి మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం హీరోలోని మరో ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తుంది. ఈ పాటలో మీనాక్షి చౌదరి, జయరామ్, సత్య వంటి వారంతా కలిసి ప్రయాణం చేసే క్రమంలో వచ్చే ఆహ్లాదకరమైన, మనసును తాకే సన్నివేశాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయని చెప్పుకోవాలి.


ఇక ఈ సాంగ్ లాంచ్ వేడుకలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘ఛలో పదవే’ పాట అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటకు అజనీష్ బి లోక్‌నాథ్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్ చాలా బాగా కుదిరాయి. ఇవన్నీ కూడా ఈ సినిమాలో నాకు ఫేవరెట్‌. ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవుతుంది. ఇందులో నేను అర్జున్ అనే పాత్రలో నటించాను. తను ఒక ట్రెజర్ హంటర్. ఈ సినిమాలోని ప్రతి లేయర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. డైరెక్టర్ కార్తీక్ ప్రతి క్యారెక్టర్‌ను ఒక కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇది ఒక లార్జ్ స్కేల్ థియేట్రికల్ స్పెక్టికల్. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో వచ్చినా, వాటిని కచ్చితంగా అందుకుంటామని తెలిపారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) మాట్లాడుతూ.. ‘వృషకర్మ’ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం చాలా గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేశారు. ఇందులో నాగచైతన్య ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?

శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నా కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

Updated Date - Nov 19 , 2026 | 11:36 PM

Vrushakarma: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Naga Chaitanya - Sobhita: ‘శ్రీమతిగా ఏడాది’ అంటూ శోభిత స్పెషల్ వీడియో

Naga Chaitanya : కసరత్తులు షురూ

Naga chaitanya 24: సైలెంట్‌గా మొదలెట్టేశాడు..

Karthik Dandu: ఎన్టీఆర్‌ వాయిస్‌తో ‘విరూపాక్ష’కు పవర్