RAPO23: సెట్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో..
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:25 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ RAPO23.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ RAPO23. ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వూల్ఫ్ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha) హీరోయిన్‌గా నటిస్తుండగా, రాపో సినిమాటిక్స్ (RAPO Cinematics) బ్యానర్‌పై కృష్ణ పోతినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ దసరా పండుగ సందర్భంగా ఒక బిగ్ అప్‌డేట్‌ను విడుదల చేశారు.
ఎప్పటినుంచో ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, వర్సటైల్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఆ వార్తలను మేకర్స్ నిజం చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ఒక స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ కూడా ఈరోజే ప్రారంభమైనట్లు తెలిపారు. బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన రితేష్ దేశ్‌ముఖ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు నేషనల్ వైడ్ క్రేజ్ లభించనుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామ్ సినిమాలో రితేష్ నటిస్తుండడంతో కినిమపి ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. రెఢీ సినిమా నుంచి రామ్ - జెనీలియా మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెల్సిందే. ఆ స్నేహ బంధంతో పాటు కథ కూడా నచ్చడంతో జెనీలియా భర్త, రితేష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రామ్.. హీరోగా, డైరెక్టర్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.