Ram Pothineni: 'బాహుబలి' నిర్మాతలతో రామ్
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:43 PM
ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు కోసం యంగ్ హీరో రామ్ తెగ ఎదురుచూస్తున్నాడు. హీరోగా నిలబడేందుకు అప్ కమింగ్ మూవీలో ఆంధ్రా కింగ్ కు తానే ఓ ఫ్యాన్‌గా మారిపోతున్నాడు. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం తనపై తానే ప్రయోగం చేసుకుంటున్నాడు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కి ఈ మధ్య అస్సలు కలిసిరావడం లేదు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నా, గత కొన్నాళ్లుగా సరైన హిట్టే లేదు. దీంతో తన అప్ కమింగ్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలుకా' (Andhra King Taluka) పైనే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ కావాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. నవంబర్ 28న బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీతో రామ్ ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేయబోతున్నాడు. ఆంధ్రాలో సినీ స్టార్స్ కోసం తెగ క్రేజ్ చూపించే ఫ్యాన్ కల్చర్‌ను ఈ మూవీలో స్టైలిష్‌గా చూపించబోతున్నారు. 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి (Mahesh Babu P) ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా వస్తోంది. రామ్ ఈ చిత్రంలో సాగర్‌గా, తన హీరో కోసం ఏమైనా చేసే వ్యక్తిగా నటిస్తున్నాడు. గత పరాజయాలన్నింటికి 'ఆంధ్రా కింగ్ తాలుకా'తో రామ్ కవర్ చేస్తాడని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్టుని కూడా లైన్లో పెడుతున్నాడు రామ్.
వచ్చే ఏడాది జనవరి 2026 నుంచి 'బాహుబలి' నిర్మాతలు, అర్కా మీడియా వర్క్స్ (Arka Media Works) అధినేతలు రామ్ తో ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాతో కిశోర్ గోపూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడట. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్‌తో పాటు రామ్ హోప్స్ అన్నీ కూడా 'ఆంధ్రా కింగ్ తాలుకా'పైనే ఉన్నాయి. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న ప్రాజెక్టు ఏ స్థాయి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
Read Also: Param Sundari - Lokah: ఆడవాళ్ళంటే అలుసా...
Read Also: SSMB29: 20 భాషలు, 120 దేశాల్లో.. SSMB29 రిలీజ్! లీక్ చేసిన కెన్యా మంత్రి