Ram Pothineni: ఏ తెలుగు హీరో కొట్టని రికార్డ్‌ని కొట్టిన రామ్.. ఎలానో తెలుసా

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:11 PM

సాధారణంగా హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఏ ఫోటో పెట్టినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది.

Ram Pothineni

Ram Pothineni: సాధారణంగా హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఏ ఫోటో పెట్టినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా బికినీలో కనిపిస్తే మిలియన్ మిలియన్ వ్యూస్ చిటికెలో వచ్చేస్తాయి. అదే స్టార్ హీరోల కొత్త సినిమా అప్డేట్స్ కానీ, ఏదైనా ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు పెడితే నెమ్మదిగా అయినా కూడా మిలియన్ వ్యూస్ చేరుకుంటాయి. కానీ, ఇలాంటివేమీ లేకుండా కేవలం ఒక్క క్యాజువల్ ఫోటో షేర్ చేసి కుర్ర హీరో కొత్త రికార్డ్ సృష్టించాడు. అతను ఎవరో కాదు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni).


రామ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ రాసిన నువ్వుంటే చాలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే.


ఇక సినిమా ప్రమోషన్స్ కోసం తప్ప రామ్ సోషల్ మీడియాను అంత ఎక్కువ ఉపయోగించడు. నువ్వుంటే చాలు సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రామ్ ఒక క్యాజువల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దానికి ఆ సాంగ్ ను యాడ్ చేశాడు. కనీసం దానికి క్యాప్షన్ లేదు, ట్యాగ్స్ లేవు.. ఏది లేదు. చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమి లేని ఫోటో అది.. ఒక చైర్ లో కూర్చొని, చేతిలో ఫోన్ పట్టుకొని పైకి చూస్తూ క్యాజువల్ గా కనిపించాడు. ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏ తెలుగు హీరో క్రియేట్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేసింది.


ఇప్పటివరకు రామ్ ఫోటో 7.6 మిలియన్ లైక్స్.. 100 మిలియన్ వ్యూస్ ను సంపాందించి మోస్ట్ లైక్డ్ పోస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. నిజం చెప్పాలంటే ఇన్ని లైక్స్ ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఫొటోకు, అది ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ లేకుండా ఫొటోకు ఇన్ని లైక్స్ రాలేదు. దీంతో రామ్ రేర్ రికార్డ్ గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటుంది. అసలు ఆ ఫొటోలో ఏముందని అంత ట్రెండ్ చేశార్రా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా రామ్ క్యాజువల్ గా కూర్చొని రికార్డ్ కొట్టాడు. ఇకపోతే ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రామ్ ఒక మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Nikhil Nagesh Bhat: హాలీవుడ్ బాటలో కిల్ డైరెక్టర్

BroCode: తల్లిని గౌరవించిన రవి మోహన్

Updated Date - Aug 29 , 2025 | 03:12 PM