Ram Charan: నా పిల్లల విషయంలో రఫ్‌గానే ఉంటా.. ఎందుకంటే?
ABN, Publish Date - Apr 14 , 2026 | 04:00 PM
చరణ్-ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లింకార అనే గారాల పట్టి ఉండగా, ఇటీవలే వారి జీవితంలోకి శివరామ్, అన్వీరా దేవి అనే కవలలు జన్మించారు. దీంతో మెగా ఇంట సందడి రెట్టింపైంది. ప్రస్తుతం తన సమయాన్ని మొత్తం ఈ ముగ్గురు చిన్నారులతో గడపడానికే చరణ్ కేటాయిస్తున్నారు.
వెండితెరపై మెగా పవర్ స్టార్‌గా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే రామ్ చరణ్ (Ram Charan), నిజజీవితంలో మాత్రం ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. అభిమానులకు హీరోగా, తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పించిన చరణ్.. ఇప్పుడు తన ముగ్గురు పిల్లల కోసం కెరీర్‌ను సైతం బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చరణ్-ఉపాసన (Charan and Upasana) దంపతులకు ఇప్పటికే క్లింకార అనే గారాల పట్టి ఉండగా, ఇటీవలే వారి జీవితంలోకి శివరామ్, అన్వీరా దేవి అనే కవలలు జన్మించారు. దీంతో మెగా ఇంట సందడి రెట్టింపైంది. ప్రస్తుతం తన సమయాన్ని మొత్తం ఈ ముగ్గురు చిన్నారులతో గడపడానికే చరణ్ కేటాయిస్తున్నారు. షూటింగ్‌లు ఎంత బిజీగా ఉన్నా, తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చడమే తనకు అత్యంత ముఖ్యం అని ఆయన నమ్ముతున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే తెలిపారు.
తాజాగా ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన పేరెంటింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనను తాను ఒక ‘రఫ్ ఫాదర్’గా అభివర్ణించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘నా పిల్లలు చాలా ధైర్యంగా, సాహస గుణంతో పెరగాలని నేను కోరుకుంటాను. వాళ్లు కష్టాలను తట్టుకునేలా, స్వతంత్రంగా ఎదిగేలా నా పెంపకం ఉంటుంది. అందుకే నేను వాళ్ల విషయంలో కాస్త రఫ్‌గా ఉంటాను’’ అని చరణ్ చెప్పుకొచ్చారు. కేవలం పిల్లలే కాదు, తన పెంపుడు జంతువులు కూడా తన ప్రపంచంలో కీలక భాగమని, వారితో గడిపే ప్రతి క్షణం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు చరణ్.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ (Peddi) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిజప్పాయింట్ అవుతున్నారు. రెండు సాంగ్స్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవ్వడంతో పాటు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జూన్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అటు పహిల్వాన్ లుక్‌లో, ఇటు క్రికెటర్‌గా రెండు గెటప్స్‌లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి:
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!