దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:18 PM
నటి, యాంకర్ విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందని.. విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు కొందరు.. ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నటి, యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందని.. విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు కొందరు.. ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విష్ణుప్రియకు చెందిన సంబంధిత ఇన్‌స్టా అకౌంట్‌ను బ్లాక్ చేయించాలని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడంతో, ఒక్కసారిగా ఆమె వార్తలలో హాట్ టాపిక్ అయ్యారు. దీంతో, ఆమెపై ఎంక్వైరీ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె తన బాడీపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. ‘‘మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా ట్రెడిషనల్‌గా, ఒక మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు. కానీ మీ పోస్ట్‌లు మాత్రం చాలా హాట్‌గా, బోల్డ్‌గా.. అంటే అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి కదా.. అందుకే మీ కాస్ట్యూమ్స్ గురించి అడుగుతున్నాను’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘చూడండి.. నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. నాకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వీటన్నిటికీ నా పోర్ట్‌ఫోలియో రెడీగా ఉండాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుతున్నాను. అంటే డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌తో, నేను ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉన్నానో అంతవరకు.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఒక టెంప్లేట్‌లాగా నా బాడీని ఉపయోగిస్తున్నాను.
అదంతా నా వర్క్‌లో ఒక భాగం మాత్రమే, కానీ అది నేను కాదు! నిజ జీవితంలో మీరు అన్నట్టు నేను చాలా ట్రెడిషనల్‌గానే ఉండటానికి ఇష్టపడతాను. ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అబ్బాయిలాగే ఒక ప్యాంటు, షర్టు వేసుకుంటాను. అందులోనే నేను చాలా కంఫర్టబుల్‌గా ఉంటాను. నాకు మరీ ‘గర్లీ’గా ఉండటం ఇష్టం ఉండదు. రియల్ లైఫ్‌లో నేను స్లీవ్‌లెస్, స్ట్రాప్‌లెస్ డ్రెస్సులు వేసుకోను. అదంతా కేవలం నా వర్క్ కోసం మాత్రమే! నాలోని ఆ సైడ్ కేవలం పని కోసమే స్విచ్ ఆన్ అవుతుంది.. పని అయిపోయాక మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రియల్ లైఫ్‌లో నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటాను’’ అని విష్ణుప్రియ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఇన్‌స్టాలో శ్రుతిమించిన విష్ణు ప్రియ అసభ్యకర ఫొటోలు, వీడియోలు! సైబర్ పోలీసులకు ఫిర్యాదు
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!