నాన్న కొడుతుంటే తమ్ముళ్లు పారిపోయారు, నేను పారిపోలేదు.. ఎందుకంటే?- రాజశేఖర్

ABN , Publish Date - Apr 13 , 2026 | 10:26 PM

శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బైకర్’. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రని పోషించారు.

Rajasekhar at Biker Event

శర్వానంద్ (Sharwanand) హీరోగా, మాళవిక నాయర్ (Malvika Nair) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బైకర్’. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో, సినిమా విడుదల తర్వాత కూడా మేకర్స్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తూనే ఉన్నారు. అలా నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో రాజశేఖర్ తన చిన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ముందుగా సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను నటించిన సినిమా హిట్ అయింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ఆయన నాకు మాత్రమే కాదు, శర్వాకి, మాళవికకి, అందరికీ చాలా మంచి పేరు తెచ్చారు. శర్వాకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన హీరోగా చేసే సినిమాలో నన్ను పెట్టుకుందాం అని అడిగినప్పుడు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ.. ఆయన ‘ఓకే’ అని చెప్పడం వల్లే నేను ఇందులో నటించాను.శర్వా, మాళవిక.. ఇద్దరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా చూడని వాళ్ళు థియేటర్‌కి వెళ్లి చూడండి. మీ అమ్మనాన్నలను, ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి’’ అని కోరారు.


చిన్నప్పుడు మీ ఫాదర్‌తో మీ బాండింగ్ ఎలా ఉండేది? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా ఫాదర్ కూడా బాగా కాదు కానీ కొంచెం స్ట్రిక్ట్. గాలిపటాలు ఎగరేయకూడదని స్టేట్‌లో రూల్ ఉండేది. మా ఫాదర్ అది పాటించేవారు. మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేది. అక్కడ పోలీసులు పట్టుకొచ్చిన గాలిపటాలను మేము వెళ్లి తెచ్చుకుని ఎగరేసేవాళ్ళం. ఒకసారి అలా గాలిపటాలు ఎగరేస్తుంటే మా ఫాదర్ బెల్ట్ పట్టుకుని కొట్టడానికి వచ్చారు. అది చూసి నా తమ్ముళ్లందరూ పారిపోయారు. కానీ నేను మాత్రం పారిపోలేదు. ఎందుకంటే పక్కన ఇళ్లల్లోని అమ్మాయిలు చూస్తున్నారు. వాళ్లు చూస్తున్నప్పుడు పారిపోతే అసహ్యంగా ఉంటుందని, పారిపోకుండా మెల్లిగా నడిచాను. మా ఫాదర్ కొడుతూనే వచ్చారు. అలా జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!

్ుషూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?

ఇది ప్రతి ఊరి కథ - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ దర్శకుడు

‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 13 , 2026 | 10:38 PM

Rajasekhar: జీవిత చెబితే నేను వింటాననుకుంటారు.. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది

Rajasekhar: 27 ఏళ్ల తరువాత రాజశేఖర్ తో రొమాన్స్ కి సిద్దమైన శివగామి

Rajasekhar: యూవీ క్రియేష‌న్స్‌లో.. శ‌ర్వానంద్‌, రాజ‌శేఖ‌ర్‌! కాంబినేష‌న్ అదిరిపోయిందిగా

Rajasekhar: జోరు పెంచిన యాంగ్రీ హీరో.. ఏకంగా మూడు సినిమాల్లో

Rajasekhar: మాన్‌స్టర్‌ గా మారిన యాంగ్రీ మాన్