Ram Charan : నాన్న.. బాబాయ్‌.. తర్వాత గౌరవించేది ఆయన్నే!

ABN , First Publish Date - 2023-03-17T23:08:26+05:30 IST

‘‘నాన్న.. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే!

Ram Charan : నాన్న.. బాబాయ్‌.. తర్వాత గౌరవించేది ఆయన్నే!

‘‘నాన్న(Chiranjeevi).. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ (pawankalyan) తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే! ఆయనే రాజమౌళి. ఇక మా ఇంట్లోకి వెళ్తే మా నాన్న నాకు ఎడమ కన్ను అయితే..బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదు’’ అని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ‘ఆస్కార్‌’ పురస్కారం అందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు అనంతరం తన తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. దేశానికి ఆస్కార్‌ అవార్డును తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను అభినందిస్తూ చరణ్‌ను శాలువాతో సత్కరించారు. తదుపరి రామ్‌చరణ్‌ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2023 సెషన్‌లో పాల్గొన్నారు. ఆ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, ఆస్కార్‌ తదితర అంశాలతోపాటు ఆసక్తికర విషయాలు చెప్పారు. (ram charan at India today Conclave 2003)

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) కథ అనుకున్నప్పుడు రాజమౌళి తారక్‌ని,(Tarak) నన్ను ఎంచుకోవడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మా ఇద్దరికి కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతుందని గమనించి మా ఇద్దరినీ సెలక్ట్‌ చేసుకున్నారు. రాజమౌళి (Rajamouli) చేసిన మ్యాజిక్‌ ఇది. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయికి వెళ్లిన సినిమా లేదు. నామినేషన్‌ వరకూ వెళ్లి ఉండొచ్చు కానీ ఈ స్థాయి క్రేజ్‌ వెళ్లింది మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమానే. ఇది జక్కన్న చేసిన మ్యాజిక్‌. ‘నాటునాటు’ పాట అంతగా పాపులర్‌ అయింది అంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉంది. హీరోలుగా చేసిన మా ఇద్దరికీ అయితే మా డైరెక్టర్‌ రాజమౌళి స్వీట్‌ టార్చర్‌ చూపించాడు. మేం కూడా అంతే ఎంజాయ్‌గా పని చేశాం. మా అందరి కష్టాల ఫలితమే ‘ఆస్కార్‌’ అవార్డు’ అని రామ్‌చరణ్‌ అన్నారు.

35 ఏళ్ల పోటీ.. ఉన్నా... (30 years war)

తారక్‌ ఫ్యామిలీకి మా కుటుంబానికి సినిమాల పరంగా, ఫ్యాన్‌ పరంగా 35 ఏళ్ళుగా పోటీ నడుస్తోంది. కానీ మా ఇద్దరి మధ్య, వ్యక్తిగతంగా మా ఇద్దరి కుటుంబాల మధ్య అలాంటిది ఏమీ లేదు. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేది కాదు. మేం కూడా అంత ఆసక్తి చూపించేవాళ్లం కాదేమో. రాజమౌళి కాబట్టే మా కెరీర్‌ను ఆయన మీద పెట్టేశాం. ఆయనంటే అంత నమ్మకం. 14 ఏళ్ల క్రితం ఆయన ‘మగధీర’తో నాకు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌, తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. వర్క్‌లో ఆయన మిస్టర్‌ పర్ఫెక్ట్‌. ఆయనచేసే పనిని ఎంత గౌరవిస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న.. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే! ఆయనే రాజమౌళి. ఇక మా ఇంట్లోకి వెళ్తే మా నాన్న నాకు ఎడమ కన్ను అయితే.. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదు’’ అని తెలిపారు.

23.jpg

రాపిడ్‌ ఫైర్‌

1. ఇష్టమైన కోస్టార్‌: కియారా అడ్వాణీ

2. పవన్‌ కల్యాణ్‌ – చిరంజీవి : రెండు కళ్లు.

3. ఎలాంటి పాత్ర చేయాలనుంది: స్పోర్ట్స్‌ నేపథ్యమున్న కథ.

(విరాట్‌ కోహ్లీ బయోపిక్‌ తీస్తే యాక్ట్‌ చేస్తా)

4. ఫేవరెట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌: రాజాస్థాన్‌ – స్విట్జర్లాండ్

Updated Date - 2023-03-18T09:24:57+05:30 IST