అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా, రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేసినప్పటి నుంచి, యమా యాక్టివ్‌గా ఉంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) వైఫ్ అన్నా లెజినోవా (Anna Lezhneva), రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేసినప్పటి నుంచి, యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె చేసే పోస్ట్‌లు వైరల్ అవుతుండటంతో పాటు, మెగా ఫ్యాన్స్‌కి, నెటిజన్లకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఆమె, తన చిన్నప్పటి ఫొటో ఒకటి షేర్ చేసి, ఆ ఫొటో వెనుక ఉన్న కథ ఏంటో తెలియజేశారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్‌లో.
‘‘ఈ ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. నేనే. నాకు అప్పుడు ఏడేళ్లు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గడ్డకట్టే చలి కాలం.. గాలి బాగా వీస్తోంది, వెలుతురు మసకగా ఉంటూ, కాసేపట్లో చీకటి కమ్ముకునేలా ఉంది. మా మ్యూజిక్ స్కూల్ స్టేజ్‌పై ఒక టర్మ్ కాన్సర్ట్ కోసం నిలబడి ఉన్నాను. అదొక పరీక్షంత సీరియస్‌గా జరుగుతోంది.. నా చేతులు ఇంకా చాలా చిన్నవి. నేను లుడ్విగ్ వాన్ బీథోవెన్ రాసిన ‘లా మార్మోట్’ వాయిస్తున్నాను. నా పక్కనే నా టీచర్ పియానో వాయిస్తూ నాకు తోడుగా ఉన్నా, నన్నే ముందుండి నడిపించనిచ్చారు. దీని తర్వాత మూడేళ్లకు నేనే స్వయంగా పియానో నేర్చుకోవడం మొదలుపెట్టాను.
నాకు ఐదేళ్ల వయసున్నప్పుడే వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించాను. చదువుతో పాటే పదిహేనేళ్లు నిండే వరకు మ్యూజిక్ స్కూల్‌కు వెళ్లాను. నేను వృత్తిపరంగా సంగీతాన్ని కొనసాగించకపోయినా, సంగీతం.. ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్ ఎప్పుడూ నాలో ఒక భాగమై ఉంటుంది. నేను ఇండియాకు వచ్చాక, నా భర్త (పవన్ కళ్యాణ్) నా కోసం ఒక పియానో కొన్నారు. నా వయోలిన్ కూడా ఇక్కడే ఉంది.. కేస్‌లో విశ్రాంతి తీసుకుంటోంది. కానీ ఈ మధ్యకాలంలో దానిని వాయించాలనే కోరిక కలగడం లేదు. బహుశా ఆ సంగీతం నా లోపలే ఎక్కడో దాగి ఉండి.. మళ్ళీ వినిపించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుంది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా సంగీతం మనుషులను కలుపుతుంది. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే బాధను, ప్రేమను, సంతోషాన్ని సంగీతం ద్వారా అనుభూతి చెందవచ్చు. ఇది సంస్కృతులకు, వ్యక్తులకు, ఖండాలకు మధ్య ఒక వారధిలాంటిది’’ అని అన్నా లెజినోవా (Anna Konidala) పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇది ప్రతి ఊరి కథ - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ దర్శకుడు
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!