Ram Charan - Upasana : ఒకే ఫ్రేమ్‌లో పెద్దోడు- చిన్నోడు.. అల్లూరి - కొమురం.. ఎందుకంటే!

ABN , First Publish Date - 2023-11-12T12:50:39+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి తమ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. వెంకటేశ్‌, మహేశ్‌బాబు - నమ్రత, ఎన్టీఆర్‌ - ప్రణతి దంపతులతోపాటు టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు.

Ram Charan - Upasana :  ఒకే ఫ్రేమ్‌లో పెద్దోడు- చిన్నోడు.. అల్లూరి - కొమురం.. ఎందుకంటే!

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన (Ram charan -Upasana) దంపతులు గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి తమ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. వెంకటేశ్‌, మహేశ్‌బాబు(Mahesh) - నమ్రత (namratha), ఎన్టీఆర్‌ - ప్రణతి దంపతులతోపాటు టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. మాట ముచ్చట్లతో సరదాగా సమయాన్ని గడిపారు. విందు భోజనం, గేమ్స్‌తో ఎంజాయ్‌ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Lady-gang.jpg

అయితే దీపావళి పండుగతోపాటు తమ కుమార్తె క్లీంకారకు ఇది తొలి మొదటి దీపావళి కావడంతో చరణ్‌ దంపతులు ఈ పార్టీ ఏర్పాటు చేశారని సన్నిహితుల నుంచి సమాచారం. ఒకే ఫొటోలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, చరణ్‌ కనిపించడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. 'పెద్దోడు - చిన్నోడు , అల్లూరి - కొమురం’ ఒకే ఫ్రేమ్‌లో... ఈ ఫొటో ఎంత ముచ్చటగా ఉంది' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ ఫొటోల్లో మంచు లక్ష్మీ, గుత్తా జ్వాలా తదితరులు కూడా ఉన్నారు.

Updated Date - 2023-11-12T13:18:27+05:30 IST