సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

ABN, Publish Date - Jun 05 , 2026 | 10:01 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదలై.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో చరణ్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

Peddi vs Devara

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదలై.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, మార్నింగ్ షో నుంచి టాక్ మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీస్ కూడా క్యూ కడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ ‘పెద్ది’పై భారీగా ట్రోలింగ్ మొదలెట్టారు. అదే సమయంలో, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఇద్దరి హీరోల అభిమానులు చేస్తున్న హంగామాతో.. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.


వాస్తవానికి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా సమయంలో.. రామ్ చరణ్, ఎన్టీఆర్ (Ram Charan and NTR) మధ్య ఒక అద్భుతమైన బ్రదర్ బాండింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని వారిద్దరూ కూడా చెప్పారు. చరణ్ ప్రతి బర్త్‌డేకి ఏం జరుగుతుందో తారక్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు రియల్ లైఫ్‌లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. కానీ, అభిమానుల మధ్య మాత్రం ఆ బాండింగ్ కనిపించడం లేదు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ.. వార్ సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (Devara) సినిమా విడుదలైనప్పుడు, చరణ్ ఫ్యాన్స్ (Ram Charan Fans) సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ట్రోలింగ్ చేశారని ఆరోపిస్తూ.. దానికి ప్రతీకారంగా, ‘పెద్ది’ థియేటర్లలోకి రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తూ ట్రోలింగ్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. హీరోలు బానే ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం ఇలా పంతాలకు పోవడం చూస్తుంటే.. వీళ్లంతా ‘ఇలా తయారయ్యారేంట్రా!’ అని అనిపించక మానదు.


ప్రస్తుతం ఈ ఇద్దరి అభిమానుల మధ్య గొడవంతా బాక్సాఫీస్ వసూళ్ల చుట్టూనే తిరుగుతోంది. ‘దేవర’ సృష్టించిన భారీ కలెక్షన్ల రికార్డులను ‘పెద్ది’ సినిమా ఈజీగా దాటేస్తుందని చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. అస్సలు బీట్ చేయలేదు, చేయనివ్వమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ కలెక్షన్ల లెక్కల యుద్ధం కాస్తా సోషల్ మీడియాలో పెద్ద గొడవగా మారి.. ఇరువర్గాల మధ్య యుద్ధాన్ని తలపిస్తోంది. సినిమా బాగుంటే థియేటర్లలో ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి, ఇలా కలెక్షన్ల ఇగోలతో ఫ్యాన్స్ కొట్టుకోవడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 05 , 2026 | 10:01 PM