Devara 2 Update: దేవర సముద్ర తీరాన్ని వణికించి ఏడాది పూర్తి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:05 PM
ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara) జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన రెండో చిత్రమిది.
ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara) జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన రెండో చిత్రమిది. గతేడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తారక్‌లోని మాస్ విపరీతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లందీ చిత్రం. నేటికి ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. అయిన సందర్భంగా నిర్మాణ సంస్థ దీని సీక్వెల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘దేవర 2’ కోసం సిద్థంగా ఉండండి అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ప్రతి సముద్ర తీరాన్ని దేవర వణికించి నేటికి ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పేరు ఇది. తాను పంచిన ప్రేమ, భయం ఎప్పటికీ మర్చిపోలేరు. ‘దేవర 2’ (Devara 2) కోసం అందరూ సిద్ధంగా ఉండండి’ అని నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుతో త్వరలోనే సీక్వెల్ పనులు ప్రారభించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా భారీ స్పాన్‌లో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే దేవర 2 షురూ అయ్యే అవకాశం ఉంది. దేవర గురించి ఓ సందర్భంలో తారక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కంటే సీక్వెల్ బాగుంటుందని చెప్పారు. అలాగే దర్శకుడు శివ కొరటాల కూడా హైప్ పెంచేలా మాట్లాడారు. పార్ట్ 1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారని, ప్రతి క్యారెక్టర్‌లో ట్విస్ట్ ఉంటుందని అన్నారు.