Devara 2: దేవర 2 క్రేజీ అప్డేట్‌.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు..

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:34 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr Ntr) ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌ 9Sudhakar Mikkilineni) ఈ విషయాన్ని వెల్లడించారు. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం 2024లో విడుదలైన సంగతి తెలిసిందే. దానికి పార్టు 2 (Devara 2) ఉంటుందని సినిమా క్లైమాక్స్‌లో చెప్పారు. అయితే ఈ చిత్రం విడుదలై చాలా కాలమైన ‘దేవర - 2’ గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అసలు పార్టు 2 ఉంటుందా లేదా అన్న అనుమానంలో అభిమానులున్నాయి. ఎట్టకేలకు ఫ్యాన్స్‌ అనుమానం తీరింది.  

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకర్‌ దేవర-2పై క్లారిటీ ఇచ్చారు. నందిగామలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు దేవర -2 ఉంటుందా? లేదా అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘దేవర- 2‘ తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మే నెల నుంచే షూటింగ్‌ ప్రారంభ కానుందని అన్నారు.  2027లో సినిమా విడుదల  చేస్తామని అభిమానులకు చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులకు మంచి బూస్ట్‌ ఇచ్చినట్లు అయింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డ్రాగన్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మే నుంచి ‘దేవర-2’కు డేట్లు కేటాయిస్తారని తెలుస్తోంది.

 
 

Updated Date - Jan 27 , 2026 | 01:42 PM