సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?

ABN, Publish Date - Apr 26 , 2026 | 11:30 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ సినిమాలో నిలిపిన ఘనత ఖచ్చితంగా రాజమౌళికే దక్కుతుంది. ఇప్పటికే ‘బాహుబలి, త్రిబుల్‌ ఆర్‌’ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌‌ను షేక్‌ చేసిన జక్కన్న.. ఈ సారి గ్లోబల్‌ వైడ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేశారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ సినిమాలో నిలిపిన ఘనత ఖచ్చితంగా రాజమౌళి (SS Rajamouli)కే దక్కుతుంది. ఇప్పటికే ‘బాహుబలి, త్రిబుల్‌ ఆర్‌’ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌‌ను షేక్‌ చేసిన జక్కన్న.. ఈ సారి గ్లోబల్‌ వైడ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేశారు. మరి అలా చేయాలంటే ఆషామాషీ కథ ఉంటే సరిపోదనే ఉద్ధేశ్యంతోనే ఇండియన్‌ మైథాలజీని బేస్‌ చేసుకొని సైన్స్‌ ఫిక్షన్‌, టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ‘వారణాసి’ (Varanasi) సినిమాను విజువల్‌ వండర్‌గా తెరకెక్కించబోతున్నారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో ఆయన రూపొందిస్తున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కామిక్-కాన్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జక్కన్న మాటల కంటే, ఆయన వెనుక గోడకు ఉన్న ఆ ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు వందల ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది!


ఈ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం ఒక పెయింటింగ్ కాదు.. రాజమౌళి సృష్టించబోయే ఒక మినీ ప్రపంచం అని స్పష్టమవుతోంది. ఇందులో అడవులు, మంచు కొండలు, ఆకాశం.. ఇలా ప్రకృతిలోని విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ-గ్లింప్స్‌లో మనం చూసిన కొన్ని లొకేషన్స్ ఈ స్కెచ్‌తో మ్యాచ్ అవ్వడం గమనార్హం. అంటే, రాజమౌళి తన విజన్‌ను ఈ స్కెచ్ రూపంలో ముందే సిద్ధం చేసుకున్నారన్నమాట. ఈ స్కెచ్ మధ్యలో కొన్ని వింతైన దృశ్యాలు ఆశ్చర్యపరుస్తాయి. కొందరు యోధులు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలపై కాకుండా, వింతైన పక్షులపై ప్రయాణిస్తున్నారు. ఒకవైపు పురాతన రథాలు కనిపిస్తుంటే, మరోవైపు గాల్లో ఎగిరే వింత ఆకృతులు, తోకపై పరిగెడుతున్న రాక్షసుడు కనిపిస్తున్నాడు. ఇందులోని చాలా విషయాలు ‘వారణాసి’ గ్లింప్స్‌తో మ్యాచ్ అవుతుండడంతో, రాజమౌళి ఈసారి గట్టి ప్లానింగే వేశాడని తెలుస్తుంది. పురాతన పురాణాలకు టైమ్ ట్రావెల్ లేదా మల్టీ-డైమెన్షన్ కాన్సెప్ట్‌ను ఏమైనా టచ్ చేస్తున్నారా? అనే అనుమానం కలగక మానదు.


ఈ స్కెచ్ కింద భాగంలో ఒక వ్యక్తి భారీ పక్షిపై కూర్చుని ఆకాశంలో విహరిస్తున్న దృశ్యం హైలైట్‌గా నిలుస్తోంది. భారతీయ పురాణాల్లోని గరుత్మంతుడు లేదా జటాయువు వంటి పాత్రల స్ఫూర్తితో రాజమౌళి ఈ విజువల్స్ డిజైన్ చేశారా.? లేక ఇది ఏదైనా గ్రహాంతర ప్రయాణమా..? ఒక యోధుడు కొండపై నుండి దూకడం, పక్షి రెక్కల సాయంతో గాల్లో తేలడం వంటివి చూస్తుంటే.. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిని దాటిపోతాయని అర్థమవుతోంది. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ ఇక్కడ ఇండియన్ మైథాలజీతో మిళితం కాబోతోంది. రాజమౌళి ధరించిన వారణాసి టీ-షర్టు నుండి, ఆయన వెనుక ఉన్న ఈ గ్లోబల్ స్కెచ్ వరకు ప్రతిదీ ఒక మాస్టర్ ప్లాన్. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపివేసి, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి జక్కన్న అమ్ములపొదిలో అస్త్రాలు సిద్ధమయ్యాయి. ఈ విజువల్ వండర్ వెండితెరపై ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?

లెజెండరీ మల్టీస్టారర్‌‌ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

Updated Date - Apr 26 , 2026 | 11:30 AM