Aadarsha Kutumbam: అసలు మాలా సాంగ్ ఎలా లేపేశారుర్రా బాబు..
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:00 PM
విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. గుంటూరు కారం తరువాత గురూజీ డైరెక్ట్ చేసిన సినిమా కావడం ఒకటి అయితే.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తరువాత వెంకీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం కావడం మరొకటి. దీంతో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
మొదటి నుంచి ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ అంతగా హైప్ ని తెచ్చుకోలేదు. నారాయణమ్మ సాంగ్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు కానీ, మాలా వచ్చా చూడు సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా వెంకీ లాంటి హీరో.. పక్కింటి అమ్మాయితో నలగాలి పూలు ఒళ్లు, అరవాలి మంచం కోళ్లు అని ఊర మాస్ లిరిక్స్ తో స్టెప్స్ వేయడం, ఇక నివేతా లాంటి అందం వెంకీతో రొమాన్స్ చేయడంతో సాంగ్ థియేటర్ లోనే చూడాలి. ప్రేక్షకులకు కన్నుల పంటగా ఉంటుంది అనుకున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లు.. థియేటర్ లో మాలా సాంగ్ ని తీసేయడం ప్రేక్షకులకు పెద్ద నిరాశగా మారింది.
అయితే, ప్రమోషన్స్ సమయంలో విడుదల చేసిన మాలా సాంగ్ సినిమాకే ప్రధాన హైలైట్గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, నిడివి ఎక్కువ అవ్వడంతో మేకర్స్ థియేటర్ వెర్షన్ నుండి ఆ పాటను తొలగించడం పెద్ద చర్చనీయాంశమైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన నెటిజన్లు ఆ పాటను ఎందుకు తీసేశారు? థియేటర్లో ఆ సాంగ్ ఉంటే సినిమా రేంజ్ ఇంకా బాగుండేది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ సాంగ్ కోసమైనా కొంతమంది ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేవారని, అనవసరమైన సాంగ్స్ ఉంచి మంచి హైప్ ఇచ్చే సాంగ్ ని లేపేయడం ఏంట్రా బాబు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మేకర్స్ ముందు ముందు ఈ సాంగ్ ని యాడ్ చేస్తారేమో చూడాలి.