13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘ఆకాశంలో ఒక తార’పై పవన్ సాధినేని ఎమోషనల్ లెటర్

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:17 PM

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుండగా, తాజాగా దర్శకుడు విడుదల చేసిన లేఖ వైరల్ అవుతోంది.

Pavan Sadineni on AOT

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోయిన్‌గా పరిచయమవుతుండగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు దర్శకుడు పవన్ సాధినేని సోషల్ మీడియా వేదికగా ‘ఇది పదమూడేళ్ల నిరీక్షణ’ అంటూ ఓ ఎమోషనల్ లేఖను విడుదల చేశారు. అందులో..

‘‘సినిమానే శ్వాసగా 13 ఏళ్ల ప్రయాణం

సినిమా కాపీ సిద్ధమైంది, విడుదల కోసం పంపించేశాము.

13 సంవత్సరాలు.. ఇందులోని ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేను సినిమానే శ్వాసగా జీవించాను. కేవలం సినిమాలు తీసే వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక కథకుడిగా మీ ముందు నిలబడే ఆ ఒక్క పెద్ద రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఒక కలను 13 ఏళ్ల పాటు నిలబెట్టుకోవడం అనేది అంత సులభమైన జర్నీ అయితే కాదు. అది మీలో ఒక భాగాన్ని తీసేసుకుంటుంది, మీరు నమ్మే ప్రతి విషయాన్ని పరీక్షిస్తుంది, మీరు ఎన్నడూ ఊహించని త్యాగాలను కోరుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో సందేహాలు, నిరాశలు, కష్టాలు, అంతులేని ప్రశ్నలు ఎదురయ్యాయి.. కానీ, సినిమాపై ఉన్న ప్రేమ మాత్రం నన్ను ఎప్పుడూ వెనకడుగు వేయనీయలేదు.


గత ఆరేళ్లు.. కేవలం ఈ ఒక్క సినిమా కోసమే ప్రాణం పెట్టడం, దానికి ఒక రూపం ఇవ్వడం, కాపాడుకోవడం.. అది సినిమాగా మారుతూ ఉంటే చూసుకోవడంలోనే గడిచిపోయాయి. ప్రపంచంలోని ప్రేమ, ఓపిక, ఆశలన్నింటినీ ధారపోసి ఒక బిడ్డను పెంచినట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దాను. ఈ ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఈ సినిమా, నా జీవితం విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి. మీరు సినిమాను మార్చలేరు, సినిమానే మిమ్మల్ని మారుస్తుందని నాకు అర్థమైంది. అది మిమ్మల్ని గొప్పగా ఉండేలా చేస్తుంది, సవాలు విసురుతుంది, మీరు ఎన్నడూ ఊహించని విధంగా మిమ్మల్ని మార్చేస్తుంది.


ఈరోజు, ఈ కథ మీ హృదయాల్లో చోటు దక్కించుకుంటుందనే ఆశతో దీనిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ సినిమాను మేమంతా ఎంతో నిజాయితీతో, దృఢ సంకల్పంతో, ప్రేమతో రూపొందించాము. నాలోని కథకుడిని మీరు నమ్మే ఆ ఒక్క క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాను. నవంబర్ 20, నాకు ఆ అవకాశాన్ని ఇస్తుందని ఎంతగానో ఆశిస్తున్నాను. నా వెన్నంటి నిలిచి, ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 13 ఏళ్ల పాటు కలలు కంటూ, ఆందోళన చెందుతూ, సినిమానే శ్వాసగా బతికిన తర్వాత.. నేను కోరుకునేది మీ ప్రేమను, ఒక ప్రశాంతమైన రాత్రి నిద్రను మాత్రమే.

నవంబర్ 20.

పదమూడేళ్ల నిరీక్షణ. ఒకే ఒక్క కథ.

ఎట్టకేలకు మీ సొంతం కాబోతున్న ఒక కల’’ అంటూ పవన్ సాధినేని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

మనవళ్లతో సూపర్ స్టార్.. ఇలా ఎప్పుడూ చూడలేదు కదా

అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే

సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే

Updated Date - Nov 19 , 2026 | 04:17 PM

Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

Pavan Sadineni: వరసగా రెండు సినిమాలతో దర్శకుడు పవన్ సాధినేని

Aakasam Lo Oka Tara: ఆకాశంలో ఒక‌ తార.. హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

Aakasam Lo Oka Tara: దుల్క‌ర్ 'ఆకాశంలో ఒక తార‌'.. కొత్త‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

AakasamLo Oka Tara: దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రో తెలుగు సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’