Peddi: ‘పెద్ది’ ఓటీటీ ట్రీట్ మాములుగా ఉండదట.. లెంగ్త్ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Jun 11 , 2026 | 08:39 PM

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ. 300 కోట్ల క్లబ్‌ని బీట్ చేసి రూ. 400 కోట్ల దిశగా దూసుకెళుతోన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.

Peddi OTT Update

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ. 300 కోట్ల క్లబ్‌ని బీట్ చేసి రూ. 400 కోట్ల దిశగా దూసుకెళుతోన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ (Peddi) చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అది ఓటీటీ ప్రియులకు పూనకాలు తెప్పించే వార్త కావడం విశేషం. ప్రస్తుతం థియేటర్లలో రికార్డులు తిరగరాస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించేలా కంటెంట్ రెడీ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఓటీటీలో ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా, సరికొత్త ‘డైరెక్టర్స్ కట్’‌తో స్ట్రీమింగ్ కానుందని ఇండస్ట్రీ టాక్.


నిజానికి దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ సినిమా కోసం దాదాపు మూడున్నర గంటలకు పైగా ఫుటేజ్‌ను షూట్ చేశారు. ఆ విషయం ఆయనే స్వయంగా తెలిపారు. కాకపోతే, థియేటర్లలో రన్‌టైమ్ ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో మొదట 3 గంటల 9 నిమిషాల వెర్షన్‌ను లాక్ చేసి.. థియేటర్లలోకి తెచ్చారు. రీసెంట్‌గా ఇందులో అప్పల సూరి పాత్రలో నటించిన జగపతి బాబు కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తను నటించిన మంచి సన్నివేశాలను కట్ చేశారని, వాటిని ఇస్తే.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటానని.. ఆయన చెప్పిన వ్యాఖ్యలతో అంతటా దుమారం రేగుతోంది. అలాగే, జాన్వీ కపూర్ విషయంలో కూడా కాంట్రవర్సీ నడుస్తోంది. అందుకే, థియేట్రికల్ వెర్షన్‌లో కట్ చేసిన కంటెంట్‌ని.. ఓటీటీ వీక్షకుల కోసం సరికొత్తగా ఎడిట్ చేసి వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీ వెర్షన్‌కు ఎలాంటి లెంత్ పరిమితులు ఉండవు కాబట్టి.. థియేటర్లలో కత్తెర పడిన లెంథీ సీన్లన్నింటినీ తిరిగి యాడ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.


ఓటీటీ వెర్షన్‌లో ఏం యాడ్ చేయబోతున్నారో కూడా తెలుపుతూ.. కొందరు ట్వీట్స్ వేస్తున్నారు. థియేటర్లలో ట్రిమ్ చేసిన కొన్ని కీలకమైన ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ ఓటీటీ వెర్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. రామ్ చరణ్ - జాన్వీ కపూర్‌ మధ్య వచ్చే లవ్ అండ్ కెమిస్ట్రీ సీన్స్, రామ్ చరణ్ - జగపతిబాబు మధ్య సాగే హై-వోల్టేజ్ డ్రామాతో పాటు కొన్ని కీలకమైన సెంటిమెంట్ సీన్లను యాడ్ చేయనున్నారట. ఈ సీన్స్ అన్నింటినీ కలపడంతో ‘పెద్ది’ ఓటీటీ (Peddi OTT) లెంగ్త్ ఏకంగా 3 గంటల 25 నిమిషాలు ఉండబోతుందని సమాచారం. థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేసిన అభిమానులకు సైతం.. ఈ కొత్త వెర్షన్ ఓటీటీలో సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది.

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Updated Date - Jun 11 , 2026 | 08:39 PM

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..