నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:29 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీపై, ముఖ్యంగా చరణ్ యాక్టింగ్‌పై అఖిల్ అక్కినేని ప్రశంసల వర్షం కురిపించారు.

Akhil Akkineni on Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం వీకెండ్‌లోనే కాకుండా, వీక్ డేస్‌లోనూ భారీగా కలెక్షన్స్‌ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని బాధపడుతున్న మెగాభిమానులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ట్వీట్‌తో ఖుషీ చేయగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కూడా చేరారు. తాజాగా అఖిల్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రామ్ చరణ్‌కు, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.


అఖిల్ చేసిన ట్వీట్‌లో రామ్ చరణ్‌ను ‘మై డియర్ బ్రదర్ ఆర్‌సి’ అని సంబోధిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నీ కష్టపడే తత్వం, అంకితభావమే ఈ సినిమాను అద్భుతంగా ముందుకు నడిపించాయి. ఇన్ని లేయర్స్, ఇన్ని వైవిధ్యమైన ట్రాన్స్‌ఫార్మేషన్స్‌తో కూడిన నీ నటన నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది. వృత్తి పట్ల నీకున్న అంకితభావానికి, ఎంతో అలవోకగా హావభావాలను పలికించే నీ శైలికి నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అంటూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌ను అఖిల్ కొనియాడారు.


ఇక ‘పెద్ది’ చిత్రం బ్లాక్‌బస్టర్ వీకెండ్‌ను సొంతం చేసుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ.. సినిమాలో కష్టపడి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ హ్యాట్సాఫ్ చెప్పారు. థియేటర్లలో కంటెంట్ బేస్డ్ సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బాక్సాఫీస్ రన్ ఇలాగే మరింత కాలం కొనసాగాలని అఖిల్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ కూడా తన ఎక్స్ వేదికగా ఇలానే స్పందించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 02:29 PM

Akhil Akkineni: అయ్యగారు.. లెనిన్ సంగతేంటి

Lenin Movie: పరువు హత్యల నేపథ్యంలో.. అక్కినేని హీరో.. ?

Lenin: అఖిల్‌.. లెనిన్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది

Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్