Peddi: ‘పెద్ది’కి కొత్తగా యాడ్ చేసే సన్నివేశాలివే.. ఎప్పటి నుంచి అంటే?
ABN , Publish Date - Jun 14 , 2026 | 09:36 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కొన్ని కొత్త సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలకు సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రం ‘పెద్ది’ (Peddi). బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో కాంట్రవర్సీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాల కంటిన్యూటీ లేకపోవడం వల్లే కొందరు విమర్శలు చేస్తున్నారని, ఇప్పుడా ప్రాబ్లమ్ లేకుండా కొన్ని సీన్లను యాడ్ చేయబోతున్నట్లుగా దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా తెలిపారు. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వారంతా సమాధానాలు ఇచ్చారు. ఈ మేరకు న్యూ సీన్స్‌ని ఎప్పుడు యాడ్ చేయబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు బుచ్చిబాబు సానా సమాధానమిస్తూ.. ఆల్రెడీ ఎడిట్ చేశాం. ఈ బుధవారం (జూన్ 17) నుంచి న్యూ సీన్స్ యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు యాడ్ చేశాం. హీరోయిన్‌కు సంబంధించిన రెండు సీన్లు, అలాగే అప్పలసూరి పాత్రకు సంబంధించి ఒక సీన్ యాడ్ చేయడం జరిగింది. ప్రేక్షకులు ఏవైతే మిస్ అయినట్లుగా ఫీల్ అవుతున్నారో అవన్నీ.. ఇప్పుడు యాడ్ చేసే సీన్లు ఫుల్‌ఫిల్ చేస్తాయని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ నటనను ప్రశంసించారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు. మేము వెళ్లిన ప్రతి థియేటర్‌లో అద్భుతమైన స్పందన రావడం చూశాం. జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్