‘పెద్ది’ 3 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై రామ్ చరణ్ ఊచకోత!
ABN , Publish Date - Jun 07 , 2026 | 04:35 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సాధించిన మూడు రోజుల కలెక్షన్స్ వివరాలతో మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ (Peddi) చిత్రం థియేటర్లలో దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ముందు పడిన ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్ వినిపించినా, మరుసటి రోజు నుంచి బలమైన మౌత్ పబ్లిసిటీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోందీ చిత్రం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’, రెండో రోజూ అదే జోరును కొనసాగించింది. మూడో రోజైన శనివారం అయితే ఊచకోత అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు రాబట్టిన కలెక్షన్ల (Peddi 3 Days Collections) వివరాలతో మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు.
మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. నాల్గవ రోజైన ఆదివారం కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది. అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌తో రన్ అవుతున్నాయి. ఇక మూడు రోజులకు గానూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లుగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో తెలిపారు. మరో వైపు నార్త్ ఇండియాలో రెండో రోజు నుంచి కలెక్షన్స్ గణనీయంగా పెరగడం విశేషం. సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్ వేగంగా వ్యాపిస్తుండటంతో హిందీ ప్రేక్షకులు కూడా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్పందన ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ, ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తోంది.
సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలతో కూడా సినిమాకు పబ్లిసిటీ లభిస్తుండటం విశేషం. ప్రస్తుతం జాన్వీ పాత్రకు సంబంధించి రెండున్నర నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, విమర్శకుల మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలతో కూడిన నటన అందరినీ కట్టిపడేస్తోంది. పలువురు ప్రేక్షకులు ఇది రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లోనే అత్యుత్తమ నటనగా అభివర్ణిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ అద్భుతంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను బీట్ చేసి, 3 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!