సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్

ABN, Publish Date - Oct 31 , 2026 | 03:56 PM

థియేటర్‌లో సినిమా చూసే అత్యుత్తమ దృశ్య, శ్రవణ అనుభూతిని ఓపెన్ గ్రౌండ్‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే అరుదైన సంకల్పంతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది.

Oh Na Siddayya Song

థియేటర్‌లో సినిమా చూసే అత్యుత్తమ దృశ్య, శ్రవణ అనుభూతిని ఓపెన్ గ్రౌండ్‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే అరుదైన సంకల్పంతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా అవుట్‌డోర్ వేదికపై ఏకంగా 70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ‘ఓ నా సిద్ధయ్య’ (Oh Na Siddayya) ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను అత్యంత వైభవోపేతంగా విడుదల చేశారు. అక్టోబర్ 30 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో ఈ వేడుక జరిగింది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు తరలివచ్చి ఈ చారిత్రక వేడుకను విజయవంతం చేయడం విశేషం.


ఈ గ్రాండ్ ఈవెంట్‌కు రియల్ హీరో, ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) ముఖ్య అతిథిగా హాజరై.. 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ‘‘ఓపెన్ ప్లేస్‌లో ఇలా 70ఎంఎం స్క్రీన్‌పై డాల్బీ అట్మాస్‌తో సాంగ్ రిలీజ్ చేయడం నిజంగా వినూత్నమైన ఆలోచన. ఇంతటి సాహసోపేత ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌కు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాట అందరి గుండెలను హత్తుకుని ఘన విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ (T Prakash Goud) మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ పాట ప్రజల ఆదరణ పొందాలని కోరారు. ఈ వేడుకలో హీరో ఇంద్రరామ్, ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్న, సంగీత దర్శకుడు బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


భార్యాభర్తల ప్రేమానుబంధానికి నిలువెత్తు రూపం ‘ఓ నా సిద్ధయ్య’

పల్లెటూరి స్వచ్ఛమైన నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత, అవగాహన, జీవితాంతం ఒకరికొకరు అండగా నిలిచే గొప్ప తత్వాన్ని ఆవిష్కరిస్తూ ‘ఓ నా సిద్ధయ్య’ భావోద్వేగ ప్రేమకథను తీర్చిదిద్దారు. సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య బంధంలోని సహజమైన ఎమోషన్స్‌ను ఇందులో అద్భుతంగా తెరకెక్కించారు. స్వయంగా సిద్ధయ్య పాత్రలో నటిస్తూ ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల (Siddu Reddy Kandakatla).. తన నిజజీవిత అనుభవాల స్ఫూర్తితోనే దీనిని రూపొందించడం విశేషం. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా చేతులు వీడకుండా, కష్టసుఖాలను సమానంగా పంచుకుంటూ సాగాలనే విలువైన సందేశాన్ని ఇచ్చారు. కేవలం స్వార్థ ప్రయోజనాలకే పరిమితం కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి బాధలను అర్థం చేసుకుంటూ ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేసే సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి.


వినోదంతో పాటు సేవా దృక్పథం

‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల వేదిక కేవలం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. నిర్మాత సిద్ధు రెడ్డి కందకట్ల నిత్యం కష్టపడి బతికే 300 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించి వారి కుటుంబాలకు భద్రత కల్పించారు. అలాగే సినీ పరిశ్రమలో తెరవెనుక రాత్రింబవళ్లు శ్రమించే సినీ కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రత, పేదలకు ఉపాధి అవకాశాలు, అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడమే తన జీవిత పరమావధి అని ఆయన నిరూపించారు. భారీ వర్షంలోనూ 70ఎంఎం స్క్రీన్‌పై డాల్బీ అట్మాస్ హోరుతో జరిగిన ఈ వేడుక ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త ‘మైలురాయి’గా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు

‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’

Updated Date - Oct 31 , 2026 | 03:56 PM