‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:09 PM
టాలీవుడ్‌లో పాట కాపీ వివాదాలు, రీమిక్స్‌ల రగడ తరచూ చూస్తూనే ఉంటాం. అయితే విడుదలకు సిద్ధమవుతున్న ఒక సినిమాలోని పాటను, తమ అనుమతి లేకుండా మరో సినిమాలో వాడేశారంటూ ఓ చిన్న చిత్ర నిర్మాత ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌లో పాట కాపీ వివాదాలు, రీమిక్స్‌ల రగడ తరచూ చూస్తూనే ఉంటాం. అయితే విడుదలకు సిద్ధమవుతున్న ఒక సినిమాలోని పాటను, తమ అనుమతి లేకుండా మరో సినిమాలో వాడేశారంటూ ఓ చిన్న చిత్ర నిర్మాత ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విడుదలకు ముస్తాబవుతున్న ‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ (Jim Jim Tara) పాటను.. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ‘పర్ణశాల’ చిత్ర నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తన బాధను వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) చిత్రంలో హీరో వెంకటేష్ (Venkatesh)కు సంబంధించిన ఓ కీలక సన్నివేశంలో తమ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను వినియోగించారని మంచి వెంకట్ తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే, మేం ఎంతో కష్టపడి రూపొందించిన పాటను అనుమతి లేకుండా ఇలా మరో చిత్రంలో వాడేయడం చిన్న సినిమాలకు తీరని అన్యాయం చేయడమే. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా రిలీజ్ అయిన ఈ పాటను ఇలా వాడటం వల్ల మా ‘పర్ణశాల’ సినిమాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. దయచేసి చిన్న సినిమాలను బతికించండి’’ అంటూ ఆయన పరిశ్రమ పెద్దలను, ప్రేక్షకులను వేడుకున్నారు.
ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ పతాకంపై మంచి వెంకట్ (Manchi Venkat) నిర్మిస్తున్న ‘పర్ణశాల’ (Parnashala) చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ గీతం ఇప్పటికే సోషల్ మీడియాలో విశేష ఆదరణ దక్కించుకుంది. సరికొత్త పబ్లిసిటీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిన్న చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే అనూహ్యంగా ఈ పాట ‘ఆదర్శ కుటుంబం’ వివాదంలో చిక్కుకోవడంతో మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి ఈ వివాదంపై ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్ చేశారేంటి?
బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్
Ramayana: శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది