బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:27 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ భారీ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పుడో రూమర్ వైరల్ అవుతుండగా, టీమ్ దానిపై క్లారిటీ ఇచ్చింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో ఓ భారీ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ క్రేజీ కాంబో సెట్ అవడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి సినిమాలు తీయడంలో కొరటాలది ప్రత్యేక శైలి. బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి కొరటాల క్లాస్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
అయితే గత రెండు మూడు రోజులుగా NBK112 సినిమా గురించి టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌ను ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా తీసుకున్నారని.. అయితే ఆయనకున్న బ్యాక్ టు బ్యాక్ కమిట్‌మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, అనిరుధ్ స్థానంలో మరో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌ను తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నిజమేనని నమ్మి ఫ్యాన్స్ కూడా ఆ వార్తలను విపరీతంగా షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో.. ఎట్టకేలకు సినిమాను నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంస్థ, డైరెక్టర్ కొరటాల శివ టీమ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న రూమర్స్ ఏవీ నమ్మవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఎవరినీ ఫైనల్ చేయలేదని తేల్చిచెప్పింది. త్వరలోనే అన్ని అధికారిక వివరాలను తామే స్వయంగా వెల్లడిస్తామని, అప్పటివరకు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌ను కోరింది. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది. మరి బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు, కొరటాల స్టైలిష్ టేకింగ్‌కు తగ్గట్టుగా అదరగొట్టే బాణీలు కట్టే ఛాన్స్ చివరకు ఏ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు దక్కుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమా చేస్తున్నారు. ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన.. ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా పూర్తి కాగానే, కొరటాల శివతో చేయబోయే హై-వోల్టేజ్ మాస్ ప్రాజెక్ట్‌ను బాలయ్య పట్టాలెక్కించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Ramayana: శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
కమెడియన్ వడివేలు 100 కోట్ల భవంతిని చూశారా.. ‘హౌస్ టూర్’ వీడియో వైరల్
జయలలిత పాత్రలో త్రిష? ఎంజీఆర్ బయోపిక్‌లో వాస్తవాలు చూపిస్తారా?