రెండు పార్ట్‌లుగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా? మరో ‘కింగ్‌డమ్’ కాదు కదా..

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:44 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘రణబాలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టారు.

Rowdy Janardhana News

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘రణబాలి’ (Ranabaali) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి విజయ్ నటిస్తున్న నెక్స్ట్ మాస్ ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) పైనే ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా.. ‘రాజా వారు రాణి గారు’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రూరల్ మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ తొలిసారి జోడీ కడుతుండగా.. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషనే సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.


అసలు విషయానికి వస్తే.. ఈ యాక్షన్ డ్రామాను కేవలం ఒక్క పార్ట్‌తో ముగించకుండా, రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ‘టూ పార్ట్ ట్రెండ్’ ఎంతలా వర్కౌట్ అవుతుందో తెలిసిందే. ‘బాహుబలి, పుష్ప’ సినిమాలు రెండు పార్ట్‌లుగా రాగా.. ‘సలార్, దేవర’ లాంటి సినిమాలు పార్ట్‌-1తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా ఇదే రూట్ పడుతున్నారు. ఇక ఇటీవల ‘జైలర్ 2’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు పార్ట్-2లను ప్రకటించేస్తున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో ఈ పార్ట్ ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కథ పరిధి చాలా పెద్దదిగా ఉండటం, రూరల్ బ్యాక్‌డ్రాప్ ఎమోషన్స్ నిండా పండించడానికి రెండు భాగాలు అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


మరోవైపు ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు, కథలో తగినంత దమ్ము ఉంటేనే రెండు భాగాలుగా తీయాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా విషయంలో ఏం జరిగిందో తెలియంది కాదు. ఆ సినిమాకు కూడా సెకండ్ పార్ట్ ఉంటుందని అన్నారు. కానీ, మొదటి పార్ట్ ఇచ్చిన రిజల్ట్‌తో, రెండో పార్ట్ అని అనడమే మానేశారు. ఇక ‘రౌడీ జనార్ధన’ విషయానికి వస్తే.. అటు ఫ్యాన్స్ కూడా అసలు కథలో నిజంగా అంత స్కోప్ ఉందా? లేక కేవలం బిజినెస్ లెక్కల కోసమే రెండు భాగాలుగా మారుస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ జనాలకు గట్టిగా ఎక్కితేనే రెండో పార్ట్‌పై అంచనాలు, బిజినెస్ పెరుగుతాయి. ఒకవేళ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం మొత్తం ఫ్రాంచైజీ మీదే పడుతుందని అంటున్నారు. మరి ఈ రూమర్స్‌పై దిల్ రాజు అండ్ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Megaverse: ఒకే స్టేజ్‌పై చిరు, పవన్, చరణ్.. మెగావర్స్‌లో మెగా ట్రీట్

సీనియర్ నటి, ‘అదుర్స్’ ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత

‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..

Updated Date - Oct 30 , 2026 | 06:44 PM

Rowdy Janardhan: ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు..

Rowdy Janardhana: ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన

Vijay Devarakonda : కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా!

VIjay Deverakonda: నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలి

Kingdom Review: విజయ్ దేవరకొండ కింగ్డ‌మ్.. ఎలా ఉందంటే ట్విట్ట‌ర్ రివ్యూ