ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు? కారణమిదేనా..

ABN , Publish Date - Nov 09 , 2026 | 04:16 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై నీలినీడలు కమ్ముకున్నట్లుగా టాక్ నడుస్తోంది.

God Of War Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్‌‌ను సంపాదించుకోవడంతో పాటు, కలెక్షన్స్‌ పరంగా డీసెంట్‌ అనిపించుకుంది. ఆ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్త ఇండస్ట్రీలోనూ, ఫ్యాన్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ భారీ ప్రాజెక్ట్ కొనసాగుతుందా లేక ఆగిపోయిందా? అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ క్రేజీ కాంబో ముందున్న సవాళ్లేంటి? ఎందుకు ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి? అనే విషయంలోకి వస్తే..


ఈ ప్రాజెక్ట్‌ను దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇంతటి భారీ వ్యయాన్ని భరించే విషయంలో నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్, ముఖ్యంగా నాన్-థియేట్రికల్, ఓటీటీ బిజినెస్‌లో ఊహించని అనిశ్చితి నెలకొంది. పాన్-ఇండియా మార్కెట్ విస్తరించినప్పటికీ, డిజిటల్ రైట్స్ రేట్లు గతంలోలా భారీ మొత్తాలకు అమ్ముడవ్వడం లేదు. దీనికి తోడు త్రివిక్రమ్ ఇటీవలి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోవడం కూడా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలను కాస్త వెనుకడుగు వేసేలా చేసిందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రం కుమారస్వామి కాన్సెప్ట్ లేదా పురాణ నేపథ్యం ఆధారంగా సాగుతుందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో ఇదే తరహా మైథలాజికల్, దైవశక్తి నేపథ్యమున్న కథలతో పలు ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ పట్టాలెక్కడం మరింత ఆలస్యమైతే, కాన్సెప్ట్‌పై ఆడియన్స్‌లో ఫ్రెష్‌నెస్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒకే తరహా జోనర్‌లో సినిమాలు వరుసగా వస్తే ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉండటం మరో ప్రధాన సవాలు.


మరోవైపు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు పూర్తిగా తారక్ చేతుల్లోనే ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఇతర పాన్-ఇండియా కమిట్‌మెంట్స్, లైనప్‌ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. బడ్జెట్ సమీకరణాలు, కథలోని మార్పులు, ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక కాస్త సమయం తీసుకుంటారా అన్నది కీలకం. ఎన్ని ఊహాగానాలు, బడ్జెట్ ఒత్తిళ్లు, మార్కెట్ లెక్కలు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ కూర్చుని నిర్ణయం తీసుకుంటే ప్రాజెక్ట్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రీ-డిజైన్ చేసి బడ్జెట్‌ను రీ-స్ట్రక్చర్ చేస్తారా లేక ప్రస్తుతానికి పక్కనపెడతారా అనే దానిపై త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

పాన్ ఇండియా సినిమాల్లో ఆ మూడు బ్యానర్స్‌దే హవా

‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది

Updated Date - Nov 09 , 2026 | 04:16 PM

God Of War: గాడ్ ఆఫ్ వార్.. గొడవ ముగిసినట్టేనా

God Of War: త్రివిక్రమ్ కన్నా ముందు కిషోర్ తిరుమల.. సెట్ అయ్యేనా

God of War: గీత దాటిన తివిక్ర‌మ్.. చ‌రిత్ర సృష్టించేనా

God of War: టైగ‌ర్‌.. అభిమానుల చిర‌కాల కోరిక! ఇది క‌దా న్యూస్‌

God of war: ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'.. షూటింగ్ ఎప్పుడంటే?