ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. ఇక పట్టుకోలేరేమో
ABN, Publish Date - Jun 28 , 2026 | 02:37 PM
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. ఆ తర్వాత ‘దేవర’తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ రిజల్ట్ కాస్త నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌కు మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. అదే ‘డ్రాగన్’.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ (Tarak).. ఆ తర్వాత ‘దేవర’ (Devara)తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ (War 2) రిజల్ట్ కాస్త నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌కు మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. అదే ‘డ్రాగన్’ (Dragon). ‘కెజియఫ్, సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. నిజానికి ఈ ఏడాదే డ్రాగన్ థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల, షూటింగ్ డిలే కావడంతో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ‘డ్రాగన్’ సినిమా లేట్ అవ్వడానికి అసలు కారణం.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాస్టర్ ప్లానే అని తెలుస్తోంది. ఈ సినిమాను సింగిల్ పార్ట్‌గా కాకుండా, ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. సాధారణంగా ఒక సినిమాకు ఫస్ట్ పార్ట్ వచ్చి, సెకండ్ పార్ట్ రావడానికి కనీసం రెండు మూడేళ్లకు పైగానే టైమ్ పడుతుంది. కానీ ‘డ్రాగన్’ విషయంలో అలా జరగకుండా, ఎలాంటి డిలే లేకుండా రెండు పార్టులను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి మేకర్స్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. మొదటి పార్ట్ రిలీజ్ అయిన కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే సెకండ్ పార్ట్‌ను దించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనుకున్న దానికంటే షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోందట. ఇక ఈ సినిమా కోసం తారక్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందెన్నడూ లేనంత స్లిమ్‌గా, స్టైలిష్‌గా, లీన్ లుక్‌లోకి మారిపోయిన ఎన్టీఆర్‌ను చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పడుతున్న డెడికేషన్ చూస్తే.. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కూడా అంచనాలను తారాస్థాయికి పెంచడంతో ‘డ్రాగన్’ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ కూడా నడుస్తోంది. ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. ఎన్టీఆర్‌కు జోడీగా టాలెంటెడ్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ నటుడు బిజూ మీనన్ వంటి ఉద్దండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి రాకతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సో.. ఈ ఏడాది ‘డ్రాగన్’ రాకపోయినా, వచ్చే ఏడాది మాత్రం తారక్ డబుల్ సిక్సర్ కొట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకే ఏడాదిలో రెండు పార్టులు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా..?
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..