Dragon: అర్ధరాత్రే నుంచే.. ఎన్టీఆర్ విధ్వంసం మొదలు!
ABN , Publish Date - May 12 , 2026 | 04:58 PM
ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సినిమా గ్లింప్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినట్లుగా, ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారట. దీంతో మే 20న నందమూరి అభిమానులకు అసలైన 'మాస్ ట్రీట్' లభించనుందని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
అయితే నందమూరి అభిమానులు మే 20 వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, మే 19 అర్ధరాత్రికే ఈ సాలిడ్ గ్లింప్స్‌ను వదిలేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. అభిమానుల్లో ఉన్న ఉత్కంఠను దృష్టిలో ఉంచుకుని, పుట్టినరోజు ముందే ఈ కానుకను అందించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో సరికొత్త ప్రపంచాలను సృష్టించిన నీల్, ఇప్పుడు తారక్ కోసం ఎలాంటి ఊహాతీతమైన లోకాన్ని సెట్ చేశారో చూడాలని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ గ్లింప్స్ దాదాపు మూడు నిమిషాల పాటు ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సందడి పెరిగింది. ముఖ్యంగా మే 18న రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ విడుదల కానుండటం, ఆ మరుసటి రోజే ఎన్టీఆర్ మూవీ గ్లింప్స్ రానుండటంతో టాలీవుడ్‌లో మెగా-నందమూరి ఫ్యాన్స్ హంగామా పీక్స్‌కు చేరుకుంది. వరుసగా ఇద్దరు స్టార్ హీరోల అప్‌డేట్స్ వస్తుండటంతో యూట్యూబ్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్లింప్స్ కోసం ఆయన గూస్‌బంప్స్ వచ్చే రేంజ్‌లో పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సిద్ధం చేశారట. అది గ్లింప్స్ స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోందని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో తారక్ స్క్రీన్ మీద కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి తారక్-నీల్ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురుచూడక తప్పుదు.