సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK111: గాడ్ ఆఫ్ మాసెస్ విధ్వంసం.. క్రేజీ అప్డేట్!

ABN, Publish Date - Jun 09 , 2026 | 08:33 PM

నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ గ్లింప్స్ రిలీజ్ టైమ్ వచ్చేసింది.

NBK111 Latest update

నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆకాశమే అవధి అనేలా అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్‌ను రేపు (జూన్ 10న) బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ (Balayya Birthday Special)గా వదలబోతోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.


బాలయ్య బర్త్‌డే స్పెషల్‌గా రాబోతోన్న గ్లింప్స్‌ను సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘వేచి చూడటానికి ఒక సమయం ఉంటుంది.. కానీ దాని ఇంపాక్ట్‌కు ఎలాంటి హద్దులు లేవు’’ అనే క్యాప్షన్‌తో మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య బాబును సరికొత్త ‘న్యూ ఏజ్’ యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం విడుదల కాబోయే స్పెషల్ గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ అవుట్‌పుట్ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ‘బాలయ్యను ఇందులో వేరే లెవెల్‌లో చూస్తారు’ అంటూ హింట్ ఇవ్వడంతో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.


బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, థమన్ ఇచ్చే ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో రీసౌండ్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం మరి.. బాలయ్య తన అభిమానులకు ఇచ్చే ‘మాస్ ట్రీట్’ ఎలా ఉండబోతోందో..

ఇవి కూడా చదవండి:

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!

Updated Date - Jun 09 , 2026 | 08:33 PM