NBK 111: బాలయ్య సరసన మరో హీరోయిన్ ఎవరంటే

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:37 PM

సినిమాలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ స్పీడ్‌ మంచి జోరుగా ఉంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'ఎన్‌బీకే 111' చిత్రంలో నటిస్తున్నారు.

సినిమాలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ స్పీడ్‌ మంచి జోరుగా ఉంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'ఎన్‌బీకే 111' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల శంకరపల్లిలో యాక్షన్‌ సన్నివేశాలతో చిత్రీకరణ మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు స్కోప్‌ ఉంది. ఇప్పటికే నయనతారను ఓ నాయికగా ఎంపిక చేశారు. రెండో కథానాయికగా కాజల్‌ను ఎంపిక చేశారని తెలిసింది.

ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భగవంత్‌ కేసరి' వచ్చింది. అయితే ఇందులో కాజల్‌ రెగ్యులర్‌ క్యారెక్టర్‌ చేయడం లేదని, పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తుందని తెలిసింది. బాలయ్య, గోపీచంద్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరసింహారెడ్డి చిత్రం వచ్చింది. ఇది రెండోది. వృద్ది సినిమాస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదు.

Updated Date - Apr 21 , 2026 | 03:38 PM