NBK 111: 'ఎన్బీకే 111' అధికారిక ప్రకటన వచ్చేసింది
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:32 PM
నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజును పురస్కరించుకొని కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమా వివరాలు వెల్లడించారు.
నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజును (జూన్ 10) పురస్కరించుకొని కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమా వివరాలు వెల్లడించారు. 'ఎన్బీకే 111' (NBK 111) అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య ఖాతాలో మరో హిట్ వేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్నీ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని పేర్కొన్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో ‘వీర సింహారెడ్డి’ విడుదలైన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2’ కోసం వర్క్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో సినిమా పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం.