సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పెద్ది’ వెనుక జరుగుతున్న కుట్రపై స్టార్ హీరోలు మాట్లాడాలి: నట్టి కుమార్

ABN, Publish Date - May 23 , 2026 | 08:38 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కాబోతున్న నేపథ్యంలో.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి మాట మార్చారు. దీనిపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు.

Natti Kumar on Peddi Release Controversy

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ సినిమా (Peddi Movie) జూన్ 4న విడుదల కాబోతున్న నేపథ్యంలో.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి మాట మార్చారు. ఇటీవల ‘పెద్ది’ విషయంలో ఎటువంటి ఆటంకాలు సృష్టించమని చెప్పిన వారే.. శనివారం తెలుగు ఫిలిమ్ ఛాంబర్‌లో సమావేశమై.. పర్సంటేజ్‌ విధానానికి ఒప్పుకుంటేనే ‘పెద్ది’ని ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ సమావేశం అనంతరం నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) మీడియా సమావేశం నిర్వహించి.. ఇలా ఎలా మాట తప్పుతారు? అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ..

‘‘సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, ఇంకా ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఇటీవల ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో సబ్ కమిటీని ఫామ్ చేశారు‌. ఆ సమయంలోనే ‘పెద్ది’ రిలీజ్ హెల్దీగా ఉంటుందని దిల్ రాజు చెప్పారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు నిర్ణయమే ఫైనల్ అని సునీల్ నారంగ్ కూడా ఆ రోజు అన్నారు. ఈ రోజు ఎగ్జిబిటర్స్ మళ్లీ ‘పెద్ది’కి పర్సంటేజ్ ఇవ్వాలంటున్నారు. ఎగ్జిబిటర్స్‌లో చాలామంది థియేటర్స్.. సునీల్ నారంగ్, దిల్ రాజు-శిరీష్‌ల లీజ్‌లో ఉన్నాయి. లీజ్ ఓనర్స్‌కు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలనే అనుమానాలు నిర్మాతలకు ఉన్నాయి. ఈ విధానం ద్వారా నిజమైన థియేటర్స్ ఓనర్స్ లాభపడాలి. అలాంటి ఎగ్జిబిటర్స్‌ను నిర్మాతలుగా మేము గౌరవిస్తాం.


సబ్ కమిటీ మీటింగ్‌లో 21 మంది తీసుకున్న నిర్ణయాలకు అందరూ ఓకే చెప్పారు‌‌. సబ్ కమిటీ నిర్ణయం ప్రకారం అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్స్ కట్టుబడి ఉంటారా? ఉంటే ఎగ్జిబిటర్స్ మరలా ఎందుకు మీడియా సమావేశం పెట్టారు. చిరంజీవి వద్దకు వెళతామంటున్నారు. కావాలంటే నేనే తీసుకెళతాను. కానీ, ‘పెద్ది’ సినిమాను ఆపుతాం.. భయపెడతాం అంటే ఎవరూ ఇక్కడ భయపడరు. ఎగ్జిబిటర్స్ వెనకాల ఉండి ఆ నలుగురు కుట్రలు చేస్తున్నారు. శాశ్వతంగా మంచి నిర్ణయం ఇండస్ట్రీ కోసం తీసుకుందాం. మంగళవారం నైట్ వరకు వెయిట్ చేస్తాం. సరైన‌ నిర్ణయం తీసుకుంటే ఓకే.. లేదంటే బుధవారం నుంచి నేనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను.


సునీల్ నారంగ్‌కు హీరోలు పార్టనర్స్‌గా ఉన్నారు‌.‌ మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారంతా పార్టనర్‌గా ఉన్నారు. ఈ రోజు ‘పెద్ది’.. రేపు మీ సినిమాలకు కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి, అల్లు అర్జున్, అరవింద్‌లతో పాటు స్టార్ హీరోలందరూ ఈ విషయమై గళమెత్తాలి. ఓన్లీ చిరంజీవి ఫ్యామిలీ‌ని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. ఆ నలుగురు సరైన డెసిషన్ తీసుకుంటారా? లేదంటే టార్గెట్ చేస్తారా? అనేది మీ ఇష్టం. టిక్కెట్ రేట్లు పెంచాలా? వద్దా? అనేది కూడా వారే చెబుతున్నారు. అది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దయచేసి ఈ కుట్రలు ఆపండి’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 23 , 2026 | 08:38 PM