సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మోక్షజ్ఞ చిత్రంలో ఎన్టీఆర్.. థియేటర్లలో విధ్వంసమే

ABN, Publish Date - Nov 28 , 2026 | 05:32 PM

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వార్తలు నిజమైతే ఎంతో బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతుంటారు. నందమూరి అభిమానులు సంబరపడే అలాంటి వార్తొకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Jr ntr in Mokshagna Film

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వార్తలు నిజమైతే ఎంతో బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతుంటారు. నందమూరి అభిమానులు సంబరపడే అలాంటి వార్తొకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదే కనుక కార్యరూపం దాల్చితే.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మామూలుగా ఉండదు! ఆ వివరాల్లోకి వెళితే..

మహానటుడు నందమూరి తారక రామారావు (NT Ramarao) నట వారసుడిగా బాలకృష్ణ (Balakrishna Nandamuri) వచ్చినట్టుగానే.. ఇప్పుడాయన నట వారసుడిగా మోక్షజ్ఞ (Mokshagna) రంగంలోకి దిగాలని అభిమానులు ఎంతోకాలంగా ఆశిస్తున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో కొన్ని ప్రకటనలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని, దానికి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తారని అధికారిక సమాచారం వచ్చింది. ఈ క్రేజీ కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు థియేటర్లు తగలబడిపోయే రేర్‌ న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో తిరుగుతోంది. అదేమిటంటే... మోక్షజ్ఞ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ (Man of Masses Jr NTR)తో గెస్ట్ అప్పీయరెన్స్ ఇప్పించే పనిలో దర్శకుడు వశిష్ఠ ఉన్నాడట.


నందమూరి మోక్షజ్ఞను తండ్రి బాలకృష్ణే హీరోగా పరిచయం చేయాలని భావించారు. కానీ యంగ్‌ డైరెక్టర్స్ చేతిలో మోక్షజ్ఞను పెడితే దాని ఫలితం వేరేగా ఉంటుందని కుటుంబ సభ్యులు భావించినట్టు తెలుస్తోంది. దాంతో ముందుగా ప్రశాంత్‌ వర్మతో సినిమా అనుకున్నా.. ఇప్పుడది వశిష్ఠ చేతిలోకి వెళ్ళింది. ట్రైమ్ ట్రావెల్‌, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కే ఈ సోషియో ఫాంటసీ మూవీలో నందమూరి బాలకృష్ణ కూడా నటించబోతున్నారట. ఆ రకంగా ఇటు బాలకృష్ణ, అటు ఎన్టీఆర్.. మధ్యలో మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే.. బాక్సాఫీస్‌ విధ్వంసం ఖాయం. ఇంతవరకూ బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌ కలిసి స్క్రీన్‌ను పంచుకున్నది లేదు. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం అది జరిగితే రేర్‌ ఫీట్‌ అవుతుంది. సో.. ఈ క్రేజీ మాస్‌ కాంబో కోసమే వశిష్ఠ తాపత్రయపడుతున్నాడని అంటున్నారు.


గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సయోధ్య సరిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రూమర్స్ మాట ఎలా ఉన్నా... ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికీ నందమూరి తారక రామారావు వారసులంతా ఒక్క త్రాటిపై నిలుస్తారని అందరూ అంటున్నారు. చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా.. వాటిని కలిసి కూర్చుని సరిచేసుకుంటారని చెబుతున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శుభతరుణంలో అతని కోసం ఎన్టీఆర్ ముందుకు వస్తాడని, గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి వెనుకాడడనీ టాక్. పైగా బాలయ్య బాబాయి అంటే అభిమానం ఉన్న ఎన్టీఆర్‌.. ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే మిస్‌ చేసుకోడని అంటున్నారు. ఇటు బాలకృష్ణ, అటు ఎన్టీఆర్ ఇద్దరూ తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా.. మోక్షజ్ఞ చిత్రంలో చేసేది అతిథి పాత్రే కాబట్టి.. వీలు చూసుకుని లేదంటే వీలు చేసుకుని నటిస్తారని భావిస్తున్నారు. అంతే కాదు.. ఈ ముగ్గురితో పాటు వశిష్ఠను ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్‌ రామ్‌ కూడా స్క్రీన్ మీద కనిపిస్తే నందమూరి అభిమానులను థియేటర్లలో పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

విశ్వక్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే

ఎన్టీఆర్‌తో మూవీ.. రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా

Updated Date - Nov 28 , 2026 | 05:32 PM