JR NTR: సినీ పితామహుడు బయోపిక్‌లో తారక్‌..

ABN , Publish Date - May 15 , 2025 | 10:04 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'డ్రాగన్‌’(Dragon-వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి 'వార్‌-2'తో బిజీగా ఉన్నారు.


జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'డ్రాగన్‌’(Dragon-వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి 'వార్‌-2'తో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తారక్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.ఆయన ఇప్పటి వరకూ పోషించని ఓ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. భారతీయ సినిమా పితాబహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే (Dadasaheb phalke biopic) పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే బహు భాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు, నితిన్‌ కక్కర్‌ దర్శకుడని ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. 

ALSO READ: RRR 2: 'ఆర్‌ఆర్‌ఆర్‌ 2' ఉపాసన ప్రశ్న.. జక్కన్న జవాబు..  

Criminal Justice: ‘క్రిమినల్‌ జస్టిస్‌ 4’ ట్రైలర్‌ ఆ మూడు నిజాలు.. ఏంటి

భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా   ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని టాక్‌ నడుస్తోంది. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా దాదాసాహెబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. అందులో ఎన్టీఆర్‌ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు తారక్‌ పచ్చ జెండా ఊపారని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.  ‘‘స్ర్కిప్ట్‌ విని ఆశ్చర్యపోయారు. ఈ కథ భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుంది. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీమ్‌ మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఫైనల్‌ స్క్రిప్ట్  కూడా లాక్‌ అయింది’’ అని ఆ నిర్మాణ సంస్థ చెప్పినట్లు బాలీవుడ్‌ మీడియా ఓ కథనంలో పేర్కొంది. అన్ని అనుకున్నట్లే జరిగి ఈ బయోపిక్ కార్యరూపం దాల్చితే తారక్ కు ఇది మొదటి బయోపిక్ అవుతుంది.  తారక్‌కు ఇది  క్రేజీ ప్రాజెక్ట్‌ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.  

Updated Date - May 15 , 2025 | 01:45 PM