విశ్వక్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:53 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Vishwak Sen Legacy Update

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ (Legacy) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కళాహి మీడియా (Kalaahi Media) బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తవడంతో చిత్ర బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, ‘లెగసీ’ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సాయికిరణ్ రెడ్డి దైదాకు, అలాగే కళాహి మీడియా సంస్థకు ఇది రెండో సినిమా కావడం విశేషం.


కథా నేపథ్యం ఏంటంటే.. “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్ (Politics is Personal)” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన భావోద్వేగాల చుట్టూ సాగుతుంది. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. రాజకీయాల ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి తీవ్ర పరిణామాలను చూపిస్తుందనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది.


ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు కే కే మీనన్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి, కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ కాగా, ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, సిరీష్ ప్రసాద్ ఎడిటింగ్, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనింగ్, స్టంట్ జశువా యాక్షన్ కొరియోగ్రఫీ.. అన్నీ హైలెట్ అనేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఈఎన్‌ఈ రిపీట్’ సక్సెస్‌తో సంతోషంగా ఉన్న విశ్వక్.. ఈ ‘లెగసీ’తో విజయవంతంగా దానిని ముందుకు తీసుకెళతారేమో చూద్దాం..

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్‌తో మూవీ.. రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా

తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?

Updated Date - Nov 28 , 2026 | 04:53 PM

LEGACY: రూట్ మార్చిన విశ్వ‌క్‌.. ఈ సారి గ‌ట్టిగానే ఫ్లాన్ చేశాడుగా

ENE Repeat: బతుకమ్మ.. ఈ కన్నె ముచ్చట వినమ్మా

ENE 2 Trailer: సినిమా హిట్ కాకపోతే ఉరి తీయండి..

Vishwak Sen : ఆవేశంతోనో.. అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు!

Vishwak Sen: భగవద్గీత తాత్పర్యం  శాశ్వతంగా నిలిచిపోతుంది