సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mega158: ‘మెగా158’లో నివేతా పేతురాజ్ లుక్ చూశారా

ABN, Publish Date - Jun 12 , 2026 | 02:27 PM

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మెగా 158’. ఈ మూవీ ఇటీవలే మొదటి షెడ్యూల్‌ షూట్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

Nivetha Pethuraj at Mega158 Sets

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolly) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మెగా 158’ (Mega 158) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. రీసెంట్‌గా తమిళనాడులోని పొల్లాచ్చిలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే, ఈ షెడ్యూల్ ముగింపు సందర్భంగా సెట్స్‌లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చోటుచేసుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టాలెంటెడ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ గ్రాండ్‌గా కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసింది.


ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నివేతా పేతురాజ్ ట్రెడిషనల్ చీరకట్టులో, తలలో పూలతో చాలా పద్ధతిగా కనిపిస్తుండగా.. పక్కనే ‘మెగా 158’ డైరెక్టర్ బాబీ కూడా ఉన్నారు. షూటింగ్ సెట్‌లోని క్రూ మొత్తం నివేతాకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలపగా.. ఆమె కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పల్లెటూరి వాతావరణం, ఆ బిల్డింగ్ సెటప్ చూస్తుంటే పొల్లాచ్చి షెడ్యూల్‌లో చాలా కీలకమైన ఫ్యామిలీ, విలేజ్ డ్రామా సీన్స్ చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. 10 ఇయర్స్ మైల్‌స్టోన్‌ను ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌లో జరుపుకోవడంపై నివేతా సైతం ఫుల్ హ్యాపీగా కనిపించారు.


ముఖ్యంగా ఈ వీడియో ద్వారా సినిమాలో నివేతా పేతురాజ్ లుక్ ఎలా ఉండబోతోందనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ట్రెడిషనల్ చీరు కట్టు, బొట్టుతో పక్కా పల్లెటూరి మహిళలా ఇందులో నివేతా అదరగొట్టేసింది. గ్లామర్ రోల్స్‌లోనే కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్‌లోనూ మెప్పించగల నివేతా.. ఈ మెగా ప్రాజెక్ట్‌లో ఒక విలేజ్ గర్ల్‌గా పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించబోతోందని అర్థమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చిరు-బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీగా అంచనాలున్నాయి. ఇందులో హోమ్‌లీ లుక్‌తో నివేతా క్యారెక్టర్ గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని మెగా ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Updated Date - Jun 12 , 2026 | 02:42 PM