సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్

ABN, Publish Date - Nov 22 , 2026 | 08:59 PM

‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మీనూ పాప.. ఇప్పుడు యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తోన్న భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Meenakshi Chaudhary

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మీనూ పాప.. ఇప్పుడు యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తోన్న భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’‌ (Vrushakarma)లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్‌షిప్స్ గురించి మీనాక్షి చౌదరి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఇంటర్వ్యూలో.. ‘‘ప్రస్తుతం మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా?’’ అని ప్రశ్నించగా, మీనాక్షి ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ షాకింగ్, అంతే ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ‘‘నాకు ఎవరిపైనా క్రష్ లేదు.. అసలు నా జీవితమే క్రష్ అయిపోయింది (నలిగిపోయింది)’’ అంటూ తనదైన పంచ్ డైలాగ్‌తో అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించేసింది. అంతేకాకుండా ప్రేమ, బ్రేకప్‌ల గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమలో పడటం ఎంత కష్టమో, బ్రేకప్ అవ్వడం కూడా అంతే కష్టమైన విషయం’ అంటూ రిలేషన్‌షిప్స్‌పై తన అభిప్రాయాన్ని ఆసక్తికరంగా పంచుకుంది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల పర్సనల్ లైఫ్ కంటే కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని మీనూ పాప మాటల్లో స్పష్టమైంది.


ఇక ‘వృషకర్మ’ సినిమా విషయానికి వస్తే.. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు ట్రెజర్ హంట్, మైథాలజీ, సస్పెన్స్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లలో కళ్లద్దాలు ధరించి, చేతిలో మండుతున్న జ్వాల పట్టుకుని మీనాక్షి చౌదరి సరికొత్త అవతారంలో ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 25న నెల్లూరులో గ్రాండ్‌గా లాంచ్ చేయనుండగా, 4 డిసెంబర్, 2026న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో మీనాక్షి పంచుతున్న ఈ ఫన్ మూమెంట్స్ సినిమాపై యూత్‌లో మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘వృషకర్మ’ రిలీజ్ పై డౌట్స్ వద్దు.. ఇదిగో క్లారిటీ

ఆదర్శ కుటుంబం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేది ఎప్పుడు?

‘డ్రాగన్’ సింగిల్ పార్టేనా.. నీల్ సంచలన నిర్ణయం

Updated Date - Nov 22 , 2026 | 08:59 PM